దక్షిణ ఆఫ్ఘనిస్తాన్‌లో 45 ఏళ్ల వ్యక్తి ఆరేళ్ల బాలికను బలవంతంగా వివాహం చేసుకున్నాడు. అమెరికాకు చెందిన ఆఫ్ఘన్ అవుట్‌లెట్ Amu.tv ప్రకారం.. ఈ వివాహం మార్జా జిల్లాలో జరిగింది. మరో ఇద్దరు భార్యలు ఉన్న ఆ వ్యక్తి.. బాలిక కుటుంబానికి వివాహానికి డబ్బులు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే తాలిబన్ పాలకులు.. ఆ వ్యక్తి బాలికను తన ఇంటికి తీసుకెళ్లకుండా నిరోధించడానికి జోక్యం చేసుకున్నారు. తొమ్మిదేళ్ల వయసులో ఆమెను తన భర్త ఇంటికి పంపవచ్చని సూచించారు. దీనికపై స్థానిక తాలిబన్ అధికారులు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.. కానీ వారు ఆ అమ్మాయిని ప్రస్తుతానికి ఆ వ్యక్తి నివాసానికి తీసుకెళ్లకుండా అడ్డుకున్నారు.
బాలిక తండ్రి, వరుడిని మార్జా జిల్లాలో అరెస్టు చేశారు. హష్ట్-ఇ సుబ్ డైలీ నివేదించిన ప్రకారం.. ఆ బాలిక ప్రస్తుతం ఆమె తల్లిదండ్రుల ఇంటి వద్ద ఉంది. ఈ సంఘటన సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది.