పంది మూత్రపిండాన్ని మనిషికి అమర్చిన వైద్యులు.. ఇదో కొత్త ప్రయోగమంటూ..

Successfully test pig kidney transplant in human patient. పంది మూత్రపిండాన్ని మనిషికి అమర్చిన వైద్యులు.. ఇదో కొత్త ప్రయోగమంటూ..

By అంజి  Published on  20 Oct 2021 1:07 PM IST
పంది మూత్రపిండాన్ని మనిషికి అమర్చిన వైద్యులు.. ఇదో కొత్త ప్రయోగమంటూ..

అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో ఓ మహిళకు మూత్ర పిండాలు చెడిపోయాయి. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించగా.. డాక్టర్లు మూత్రపిండాన్ని మార్చాలని చెప్పారు. అయితే మూత్రపిండం దానం చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో వైద్యులు కొత్త ప్రయోగం చేశారు. దీనికి ఆ మహిళ బంధువులు కూడా అంగీకారం తెలిపారు. పంది మూత్ర పిండాన్ని రోగికి మార్పిడి చేశారు. మూడు రోజుల పాటు శ్రమించి పంది మూత్ర పిండాన్ని ఆమె రక్తనాళాలకు కలిపారు. మూత్రపిండం మార్పిడి తర్వాత రోగిలో సాధారణ ఫలితాలు కనిపించాయని ప్రముఖ సర్జన్ డాక్టర్ రాబర్ట్‌ మోంట్‌గోమేరీ తెలిపారు. ఎన్‌వైయూ లాంగోన్‌ హెల్త్‌లో వైద్యులు ఈ ట్రాన్స్‌ప్లాంట్‌ నిర్వహించారు.

ఇది మానవ అవయవాల కొరతను తగ్గించడంలో ముందడుగని వైద్యులు అంటున్నారు. అమెరికాలో దాదాపు 90 వేల మందికిపైగా కిడ్నీ కోసం ఎదురుచూస్తున్నారని యునైటెడ్ నెట్‌వర్క్‌ ఫర్ ఆర్గాన్ షేరింగ్ నివేదిక ద్వారా తెలుస్తోంది. అవయమార్పిడి కోసం ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్నారు. జంతువుల అవయవాలను మార్పిడి చేసే విషయమై పరిశోధకులు ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు సాగిస్తున్నారు. యునైటెడ్‌ థెరప్యూటిక్స్‌ కార్ప్‌ యొక్క రివైవికర్‌ యూనిట్‌ అభివృద్ధి చేసిన గాల్‌సేఫ్‌ను మాంసం అలెర్జీ ఉన్నవారికి ఆహారం, మానవ చికిత్సకు ఉపయోగిస్తారు. దీనికి డిసెంబర్‌ 2020లో ఎఫ్‌డీఏ ఆమోదం తెలిపింది. జన్యుపరంగా మార్పు చెందిన పందిని గాల్‌సేఫ్‌గా పిలుస్తారు.

Next Story