శ్రీలంక మాజీ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే అరెస్ట్ అయ్యారు. అవినీతి ఆరోపణల కేసులో ఆయనను అరెస్టు చేసినట్లు సమాచారం. సమాచారం ప్రకారం.. కొలంబోలోని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సిఐడి) శుక్రవారం మాజీ అధ్యక్షుడిని అరెస్టు చేసింది. పాత అవినీతికి సంబంధించిన కేసులో తన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయడానికి సిఐడి కార్యాలయానికి చేరుకున్న సమయంలో అతని అరెస్టు జరిగిందని నివేదికలు వెల్లడించాయి.
శ్రీలంక మాజీ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే స్టేట్‌మెంట్ ఇచ్చేందుకు శుక్రవారం ఎఫ్‌సిఐడి ఎదుట హాజరయ్యారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆ సమయంలోనే మాజీ అధ్యక్షుడిని అరెస్టు చేసిన తర్వాత కొలంబో ఫోర్ట్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు.
గోటబయ రాజపక్సే మిగిలిన పదవీకాలానికి విక్రమసింఘే జూలై 2022లో శ్రీలంక అధ్యక్షుడయ్యారు. అవినీతి, నిధుల దుర్వినియోగానికి వ్యతిరేకంగా కొన్ని నెలల నిరసనల తర్వాత గోటబయ రాజపక్స పదవీవిరమణ చేశారు. 2022లో శ్రీలంకలో ఏర్పడిన అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభానికి రాజపక్సే కారణమని చెప్పబడింది. సెప్టెంబర్‌లో విక్రమసింఘే తిరిగి ఎన్నికయ్యే ప్రయత్నంలో ఓడిపోయారు.