భారత్‌ను ఆ సాయం కోరిన శ్రీలంక

Sri Lanka seeks help from India. శ్రీలంక ఆర్ధిక పరిస్థితి రోజు రోజుకీ దిగజారిపోతూ ఉన్న సంగతి తెలిసిందే..! దీంతో ఆర్థికంగా నిలదొక్కుకోడానికి ఇతర దేశాల

By అంజి  Published on  17 Oct 2021 9:46 AM GMT
భారత్‌ను ఆ సాయం కోరిన శ్రీలంక

శ్రీలంక ఆర్ధిక పరిస్థితి రోజు రోజుకీ దిగజారిపోతూ ఉన్న సంగతి తెలిసిందే..! దీంతో ఆర్థికంగా నిలదొక్కుకోడానికి ఇతర దేశాల దగ్గర లోన్ తీసుకుంటూ ఉంది. భారత్ కూడా శ్రీలంకకు కావాల్సిన సాయం చేస్తూ వెళుతుండగా.. మరోసారి భారత్ ను సాయం కోసం అడిగింది శ్రీలంక. క్రూడ్ ఆయిల్ ను కొనుక్కోడానికి భారత్ ను డబ్బులు సాయం చేయాల్సిందిగా శ్రీలంక కోరింది.

చ‌మురు కొన‌డానికి 50 కోట్ల డాల‌ర్లు ఇవ్వాల‌ని కోరింది. ప్ర‌స్తుతం శ్రీలంక‌లో ఉన్న చ‌మురు వ‌చ్చే జ‌న‌వ‌రి వ‌ర‌కు మాత్ర‌మే స‌రిపోతుంద‌ని ఆ దేశ ఇంధ‌న శాఖ మంత్రి ఉద‌య గ‌మ్మ‌న్‌పిలా చెప్పారు. అక్క‌డి ప్ర‌భుత్వ రంగ సంస్థ సీలోన్ పెట్రోలియం కార్పొరేష‌న్.. ప్ర‌ధాన ప్ర‌భుత్వ బ్యాంకులైన బ్యాంక్ ఆఫ్ సీలోన్‌, పీపుల్స్ బ్యాంక్‌ల‌కు సుమారు 330 కోట్ల డాల‌ర్లు బాకీ ప‌డింది. మ‌ధ్య‌ప్రాచ్య దేశాలు, సింగ‌పూర్ నుంచి శ్రీలంక ఆయిల్ కంపెనీలు చమురును దిగుమ‌తి చేసుకుంటాయి. ఇప్పుడు ఇండియా, శ్రీలంక ఆర్థిక భాగ‌స్వామ్య ఒప్పందం కింద 50 కోట్ల డాల‌ర్లు ఇవ్వాల‌ని కోరామ‌ని, దీనికోసం ప్ర‌స్తుతం ఇండియ‌న్ హైక‌మిష‌న్‌తో మాట్లాడుతున్న‌ట్లు సీపీసీ చైర్మ‌న్ సుమిత్ విజేసింఘె తెలిపారు. ఈ డ‌బ్బుతో పెట్రోల్‌, డీజిల్ కొంటామ‌ని చెప్పారు. ఈ అప్పుపై త్వ‌ర‌లోనే ఇండియా, శ్రీలంక ఇంధ‌న శాఖ కార్య‌ద‌ర్శులు త్వ‌ర‌లో ఒప్పందం చేసుకోనున్నారు.

కరోనా మహమ్మారి కారణంగా శ్రీలంక టూరిజం బాగా దెబ్బతింది. దీంతో ఆర్థికంగా దెబ్బతింది. లంక తీవ్ర విదేశీ మారక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ఆర్థిక మంత్రి బాసిల్ రాజపక్స గత నెలలో చెప్పారు. ఆ దేశ జీడీపీ కూడా భారీగా తగ్గిపోయింది.

Next Story