హత్యకు గురైన అమెరికన్ రాపర్ మార్కెల్ మారో అలియాస్ గూనెవ్ శవాన్ని వేలాడదీశారు. వైరల్ వీడియోలలో కళాకారుడి భౌతిక కాయాన్ని అతడి అంత్యక్రియలలో భాగంగా వేలాడదీశారు. డిజైనర్ దుస్తులు, కిరీటం అతడిపై ఉంచి.. నిర్జీవమైన శరీరాన్ని వాషింగ్టన్ DCలోని ఒక నైట్‌క్లబ్‌లో బొమ్మలాగా ఉంచారు. అక్కడ అతని కుటుంబం, స్నేహితులు అతనికి "సెండాఫ్ పార్టీ" ఇచ్చారు. ట్విట్టర్‌లో పోస్ట్ చేయబడిన వీడియోలు రాపర్ ను స్మరిస్తూ ప్రజలు నృత్యం చేయడం, పాడటం, ఆనందిస్తున్నట్లు చూపించాయి. శవం వేదికపై వేలాడుతూ కనిపించింది.
రాపర్ తల్లి, ప్యాట్రిస్ మారో, ఫాక్స్ 5 DCతో మాట్లాడుతూ.. తన కొడుకుకు అతడు మరణించిన తర్వాత తాను బాధపడటం ఇష్టం లేదని, నైట్‌క్లబ్‌లోని వేడుక అతని జీవితాన్ని గౌరవించటానికి ఉత్తమ మార్గమని తాము భావించామన్నారు. "ప్రజలు తాము చెప్పాలనుకున్నది చెబుతారు. నేను నా కొడుకును ఎలా పంపించానో అందుకు నేను సంతోషిస్తున్నాను" అని మారో చెప్పారు. Markelle Morrow, 24, మేరీల్యాండ్‌లోని డిస్ట్రిక్ట్ హైట్స్‌లోని ఒక పార్కింగ్ స్థలంలో జరిగిన కాల్పులలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాల్పుల ఘటనపై విచారణ జరుగుతోంది.