స్కూల్ బస్సులో చెలరేగిన మంటలు.. 25 మంది విద్యార్థులు దుర్మ‌ర‌ణం

థాయ్‌లాండ్‌లో 44 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులతో ప్రయాణిస్తున్న బస్సులో ఘోర అగ్నిప్రమాదం జరిగింది

By Medi Samrat  Published on  1 Oct 2024 4:49 PM IST
స్కూల్ బస్సులో చెలరేగిన మంటలు.. 25 మంది విద్యార్థులు దుర్మ‌ర‌ణం

థాయ్‌లాండ్‌లో 44 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులతో ప్రయాణిస్తున్న బస్సులో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి 25 మంది విద్యార్థులు మరణించారు. ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటన మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో జరిగింది. ఈ ప్రమాదం థాయ్‌లాండ్‌లోని ఖు ఖోట్‌లోని జీర్ రంగ్‌సిట్ షాపింగ్ సెంటర్‌కు దగ్గరగా ఉన్న ఫాహోన్ యోథిన్ రోడ్‌లో చోటు చేసుకుంది.

స్కూల్ బస్సులో మంటలు చెలరేగిన క్షణాన్ని పలువురు తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. రోడ్డు పక్కన ఉన్న బస్సు నుండి పెద్ద ఎత్తున నల్లటి పొగలు కమ్ముకున్నాయి. మంటలు చెలరేగిన కొన్ని గంటల తర్వాత కూడా మృతదేహాలు బస్సులోనే ఉన్నాయి. బస్సులో ఉన్న విద్యార్థులు ప్రాథమిక, జూనియర్ ఉన్నత పాఠశాలలో చదువుతున్నట్లు సమాచారం. మృతుల సంఖ్య ఇంకా ధృవీకరించబడనప్పటికీ, ప్రాణాలతో బయటపడిన వారి సంఖ్య 25 మంది అని మంత్రి అనుతిన్ చార్న్‌విరాకుల్ వెల్లడించారు. బస్సు డ్రైవర్ ప్రాణాలతో బయటపడినట్లు సమాచారం. ఘటన అనంతరం అక్కడి నుండి పారిపోయాడు. అతడి ఆచూకీ తెలియలేదు.

Next Story