డొనాల్డ్ ట్రంప్ ఇంటికి కాపలాగా.. ఎలాంటి కుక్కను తీసుకొచ్చారంటే.?

US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడా ఎస్టేట్ 'మార్-ఎ-లాగో' కు సెక్యూరిటీగా రోబో డాగ్స్ ను తీసుకుని వచ్చారు

By Medi Samrat  Published on  11 Nov 2024 3:33 PM IST
డొనాల్డ్ ట్రంప్ ఇంటికి కాపలాగా.. ఎలాంటి కుక్కను తీసుకొచ్చారంటే.?

US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడా ఎస్టేట్ 'మార్-ఎ-లాగో' కు సెక్యూరిటీగా రోబో డాగ్స్ ను తీసుకుని వచ్చారు. ట్రంప్ ఇటీవలి ఎన్నికల విజయం తర్వాత, లగ్జరీ ఎస్టేట్ వద్ద భద్రతను పెంచారు. సీక్రెట్ సర్వీస్ ఈ హైటెక్ "గార్డ్ డాగ్"ని నిఘాలో ఉంచింది. నాలుగు మెటల్ కాళ్లు, అధునాతన నిఘా సాధనాల శ్రేణితో రోబోట్ డాగ్ ఉంది.


రోబో కుక్క గురించి న్యూయార్క్ పోస్ట్ నివేదించింది. రోబోట్ డాగ్ మార్-ఎ-లాగో పచ్చిక బయళ్ల చుట్టూ తిరుగుతూ, కదులుతున్న వీడియోను షేర్ చేసింది. బోస్టన్ డైనమిక్స్ సంస్థ తయారు చేసిన ఈ రోబోట్ డాగ్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన వారిని సురక్షితంగా ఉంచే సీక్రెట్ సర్వీస్ ప్రయత్నంలో భాగం. సీక్రెట్ సర్వీస్ ఈ రోబోట్ ఏమి చేయగలదో ఖచ్చితంగా చెప్పలేదు. కానీ ఎస్టేట్‌ను రక్షించడంలో సహాయపడే సాంకేతికతతో ఈ రోబో డాగ్ పని చేస్తుందని తెలిపారు. మార్-ఎ-లాగో లోపల ట్రంప్ తన కొత్త పరిపాలన విభాగాన్ని సిద్ధం చేయడంలో బిజీగా ఉన్నారు. ఆయన ఎస్టేట్ వద్ద భద్రత కట్టుదిట్టంగా ఉంది. ఎన్నికల ప్రచారం సందర్భంగా ట్రంప్ ను చంపడానికి రెండుసార్లు ప్రయత్నాలు చేసారు. ఇలాంటి పరిస్థితుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఇక ఈ రోబోట్ కుక్క అదనపు రక్షణను అందిస్తుంది.

రోబోటిక్ డాగ్స్ కొన్ని దేశాల మిలిటరీలు కూడా ఉపయోగిస్తున్నారు. ఉక్రెయిన్‌లో సైనికులకు సహాయం చేయడానికి, సామాగ్రిని పంపిణీ చేయడానికి, శత్రువుల ప్రాంతాలను చూడటానికి మోహరించారు.

Next Story