2021లో రికార్డు స్థాయిలో 488 మంది జర్నలిస్టులు అరెస్ట్‌, 46 మంది హత్య: ఆర్‌ఎస్‌ఎఫ్‌

Record 488 journalists imprisoned, 46 killed in 2021: RSF. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 488 మంది జర్నలిస్టులు ఖైదు చేయబడ్డారు. సుమారు 46 మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారు.

By అంజి  Published on  16 Dec 2021 7:45 AM GMT
2021లో రికార్డు స్థాయిలో 488 మంది జర్నలిస్టులు అరెస్ట్‌, 46 మంది హత్య: ఆర్‌ఎస్‌ఎఫ్‌

ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 488 మంది జర్నలిస్టులు ఖైదు చేయబడ్డారు. సుమారు 46 మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. అయితే గత 25 సంవత్సరాల నుండి జరల్నిస్టుల అరెస్ట్‌లు లెక్కింపు ప్రారంభించినప్పటి నుండి.. ఈ ఏడాదే అత్యధిక మంది జర్నలిస్టులు అరెస్ట్‌ అయ్యారని రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అనే సంస్థ వెల్లడించింది. మధ్య ప్రాచ్య దేశాల్లో సంఘర్షణలు తగ్గు ముఖం పట్టడం కారణంగానే హత్యల సంఖ్య తగ్గిందని ఆర్‌ఎస్‌ఎఫ్‌ చెబుతోంది. "1995లో ఆర్‌ఎస్‌ఎఫ్ వార్షిక రౌండ్-అప్‌ను ప్రచురించడం ప్రారంభించినప్పటి నుండి వారి పనికి సంబంధించి నిర్బంధించబడిన జర్నలిస్టుల సంఖ్య ఇంత ఎక్కువగా లేదు" అని పత్రికా స్వేచ్ఛ కోసం పోరాడుతున్న ఎన్‌జీవో ఒక ప్రకటనలో తెలిపింది.

మయన్మార్, బెలారస్, హాంకాంగ్‌లలో మీడియాపై అణిచివేతలు ఎక్కువ అయ్యాయని పేర్కొంది. గత సంవత్సరంలో పోలిస్తే ఈ సంవత్సరం దాదాపు 20 శాతం అరెస్ట్‌లు పెరిగాయి. 2020 కంటే ఎక్కువ మంది మహిళా జర్నలిస్టులు ఈ సంవత్సరం అరెస్ట్‌ అయ్యారని ఆర్‌ఎస్‌ఎఫ్‌ తెలిపింది. మొత్తం 60 మంది మహిళా జర్నలిస్టులు అరెస్ట్ అయ్యారు. 127 మంది ఖైదు చేయబడిన జర్నలిస్టులతో చైనా ముందుంది. మయన్మార్ 53తో రెండో స్థానంలో ఉండగా, వియత్నాం (43), బెలారస్ (32), సౌదీ అరేబియా (31) మంది జర్నలిస్టుల అరెస్ట్‌లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

2016లో గరిష్ట స్థాయి నుండి మరణాల సంఖ్య తగ్గడం సిరియా, ఇరాక్, యెమెన్‌లలో యుద్ధ వాతావరణం మారుతుండటంతో జర్నలిస్టుల హత్యలు తగ్గాయి. ఈ ఏడాది జరిగిన 46 హత్యలలో ఎక్కువ భాగం హత్యలు ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుని చేయబడ్డాయని అని నివేదిక పేర్కొంది. మెక్సికో, ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో వరుసగా ఏడు నుండి ఆరుగురు జర్నలిస్టులు, యెమెన్, భారతదేశంలో నలుగురు చొప్పున జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. ప్రపంచవ్యాప్తంగా బందీలుగా ఉన్న 65 మంది జర్నలిస్టులు, సహచరులను కూడా ఆర్‌ఎస్‌ఎఫ్‌ లెక్కించింది.

Next Story