జాగ్రత్తగా ఉండండి.. ట్రంప్‌కు పుతిన్ సూచన..!

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌ను తెలివైన, అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడిగా రష్యా ప్రెసిడెంట్ పుతిన్ అభివర్ణించారు.

By Medi Samrat  Published on  29 Nov 2024 8:25 PM IST
జాగ్రత్తగా ఉండండి.. ట్రంప్‌కు పుతిన్ సూచన..!

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌ను తెలివైన, అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడిగా రష్యా ప్రెసిడెంట్ పుతిన్ అభివర్ణించారు. కానీ డొనాల్డ్ ట్రంప్ ప్రాణాలకు రక్షణ లేదన్నారు. ఎన్నికల ప్రచారం సమయంలో ట్రంప్ పై జరిగిన హత్యాయత్నాలు తనను షాక్ కు గురిచేశాయని తెలిపారు. ఖజికిస్తాన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన పుతిన్ ట్రంప్ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని, వీటన్నింటినీ ట్రంప్ అర్థం చేసుకోవాలన్నారు. అమెరికా చరిత్రలోనే ఈసారి దురదృష్టకర ఘటనలు చోటుచేసుకున్నాయని, ఎన్నికల్లో ట్రంప్‌పై పోరాడేందుకు కొందరు అనాగరిక పద్ధతులు పాటించారని పుతిన్ ఆరోపించారు. ఆయన కుటుంబాన్ని, పిల్లలను లక్ష్యంగా చేసుకొని రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు చేశారన్నారు.

జూలైలో పెన్సిల్వేనియాలో జరిగిన ప్రచార ర్యాలీలో ట్రంప్ చెవిలో బుల్లెట్ దూసుకెళ్లడంతో తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. సెప్టెంబరులో జరిగిన ఓ సంఘటనలో ఫ్లోరిడాలో ఒక వ్యక్తి ట్రంప్ పై హత్యాయత్నానికి ప్రయత్నించాడు. ట్రంప్‌ ఏమాత్రం సురక్షితంగా లేరని తనకు అర్థం అవుతోందని, ఆయన ముప్పును అర్థం చేసుకొని జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నానన్నారు పుతిన్. ఉక్రెయిన్‌ కు మద్దతు ఇస్తున్న బిడెన్ త్వరలో అమెరికా ప్రెసిడెంట్ గా పదవి చేపట్టనున్న ట్రంప్ బృందానికి అదనపు ఇబ్బందులు సృష్టించారని కూడా పుతిన్ విమర్శించారు.

Next Story