Viral Video : ప్రధానిని కలిసిన దేవిశ్రీ ప్రసాద్

న్యూయార్క్‌లో జరిగిన మోదీ అండ్ యూఎస్ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు

By Medi Samrat
Published on : 25 Sept 2024 4:47 PM IST

Viral Video : ప్రధానిని కలిసిన దేవిశ్రీ ప్రసాద్

న్యూయార్క్‌లో జరిగిన మోదీ అండ్ యూఎస్ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వైరల్ పిక్చర్, వీడియోలో ఇద్దరూ ఆప్యాయంగా పలకరించుకోవడం చూడవచ్చు. ప్రధానిని కలవడం గురించి దేవి శ్రీ ప్రసాద్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. న్యూయార్క్‌కు వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని స్వాగతించే భారీ కార్యక్రమంలో భాగమైనందుకు ఎంతో సంతోషంగా ఉన్నానని తెలిపారు.

హర్ ఘర్ తిరంగా పాటను కంపోజ్ చేసే అవకాశం వచ్చిన రోజు మాటల్లో చెప్పలేని విషయని దేవి శ్రీ ప్రసాద్ తెలిపారు. నరేంద్ర మోదీకి స్వాగతం పలికేందుకు ఈ పాట పాడడం నా జీవితంలో ఒక ఐకానిక్, అత్యంత ప్రతిష్టాత్మకమైన క్షణం అని దేవిశ్రీ తెలిపారు. ప్రధాని మోదీ నన్ను ఆప్యాయంగా పలకరించిన విధానం, నన్ను ఆప్యాయంగా, ప్రేమపూర్వకంగా కౌగిలించుకోవడం నా జీవితాంతం నేను ఎప్పటికీ మరచిపోలేనన్నారు దేవి శ్రీ ప్రసాద్.

Next Story