కమల హారిస్‌కు ప్రత్యేక బహుమతులు ఇచ్చిన ప్రధాని మోదీ

PM Modi’s special gift to Kamala Harris. భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే..!

By Medi Samrat  Published on  24 Sep 2021 1:52 PM GMT
కమల హారిస్‌కు ప్రత్యేక బహుమతులు ఇచ్చిన ప్రధాని మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే..! అమెరికా ఉపాధ్యక్షురాలు కమల హారిస్‌కు నరేంద్ర మోదీ ప్రత్యేక బహుమతులిచ్చారు. ఆమె పూర్వీకులను గుర్తుకు తెచ్చే విధంగా ఈ బహుమతులు ఉన్నాయి. ఆమె తాత గారు పీవీ గోపాలన్‌కు సంబంధించిన పాత నోటిఫికేషన్ల కాపీని వుడెన్ హ్యాండిక్రాఫ్ట్ ఫ్రేమ్‌లో పెట్టి ఆమెకు ఇచ్చారు. పీవీ గోపాలన్ గౌరవప్రదమైన సీనియర్ ప్రభుత్వాధికారి. ఆయన వివిధ పదవులను నిర్వహించారు.

ఆయనకు సంబంధించిన నోటిఫికేషన్ల కాపీని కమల హారిస్‌కు మోదీ ఇచ్చారు. గులాబీ మీనాకారి చదరంగం సెట్‌ను కూడా మోదీ ఆమెకు ఇచ్చారు. అద్భుతమైన హస్తకళా నైపుణ్యంతో తయారు చేయించారని తెలుస్తోంది. దీనిలోని ప్రకాశవంతమైన రంగులు కాశీ విశిష్టతను తెలియజేస్తాయి. గులాబీ మీనాకారి అనేది అద్భుతమైన వృత్తి.. ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతన నగరాల్లో ఒకటైన కాశీకి సంబంధించినది. ఈ బహుమతులను చూసి కమల ఎంతో ఆనందించారు.


Next Story