చైనా పర్యటనకు వెళ్ల‌నున్న‌ ప్రధాని మోదీ.. ఆ ఘర్షణ తర్వాత ఇదే తొలిసారి..!

ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 31 నుంచి చైనా పర్యటనకు వెళ్లనున్నారు.

By Medi Samrat
Published on : 6 Aug 2025 6:10 PM IST

చైనా పర్యటనకు వెళ్ల‌నున్న‌ ప్రధాని మోదీ.. ఆ ఘర్షణ తర్వాత ఇదే తొలిసారి..!

ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 31 నుంచి చైనా పర్యటనకు వెళ్లనున్నారు. వార్తా సంస్థ రాయిటర్స్ ఈ విషయాన్ని మూలాధారాలను ఉటంకిస్తూ పేర్కొంది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సిఓ) సమావేశంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ చైనాకు వెళ్లనున్నట్లు రాయిటర్స్ తెలిపింది. అయితే ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు.

SCO 2001లో స్థాపించబడింది. ప్రస్తుతం SCOలో 10 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో చైనా, భారతదేశం, కజకిస్తాన్, కిర్గిజ్స్తాన్, రష్యా, పాకిస్థాన్, తజికిస్తాన్, ఇరాన్, బెలారస్ ఉన్నాయి. SCO స్టేట్ కౌన్సిల్ యొక్క 25వ సమావేశం ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 1, 2025 వరకు చైనాలోని టియాంజిన్ నగరంలో జరగనుంది.

గత నెలలో విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ కూడా చైనా పర్యటనకు వెళ్లారు. గాల్వాన్ ఘర్షణ తర్వాత ఈ పర్యటన జరిగింది. ఇరు దేశాల మధ్య సంబంధాలలో ఉద్రిక్తతను తగ్గించే దిశగా ఒక అడుగుగా భావిస్తున్నారు. ఐదేళ్లలో జైశంకర్ చైనాలో పర్యటించడం ఇదే తొలిసారి. ఇక్కడ జరిగిన SCO విదేశాంగ మంత్రుల సమావేశంలో జైశంకర్ పాల్గొన్నారు.

ప్రధాని మోదీ ఇప్పటి వరకు 5 సార్లు చైనాలో పర్యటించారు. మే 2015లో తొలిసారిగా ప్రధాని చైనాను సందర్శించారు. ఈ పర్యటనలో జీ జిన్‌పింగ్ ప్రధాని మోదీని తన సొంత రాష్ట్రం జియాన్‌కు తీసుకెళ్లారు. దీని తరువాత మోదీ సెప్టెంబర్ 2016, సెప్టెంబర్ 2017, ఏప్రిల్ 2018, జూన్ 2018 లో చైనా వెళ్ళారు.

PM మోడీ, Xi Jinping చివరిసారిగా అక్టోబర్ 2024 లో కలుసుకున్నారు. దాదాపు 50 నిమిషాల పాటు ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలో.. సరిహద్దులో శాం, స్థిరత్వాన్ని కొనసాగించడంతోపాటు అనేక అంశాలు చర్చించబడ్డాయి. అమెరికా సుంకాల విధింపు నేప‌థ్యంలో ప్రధాని మోదీ ఈ పర్యటనకు ప్రాధాన్య‌త ఏర్ప‌డ‌నుంది.

Next Story