ట్రంప్ వ్యాఖ్యలకు మోదీ కౌంటర్

భారత ఆర్థిక వ్యవస్థ 'చచ్చిపోయింది' అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన విమర్శలపై ప్రధాని నరేంద్ర మోదీ గట్టిగా బదులిచ్చారు.

By Medi Samrat
Published on : 2 Aug 2025 4:26 PM IST

ట్రంప్ వ్యాఖ్యలకు మోదీ కౌంటర్

భారత ఆర్థిక వ్యవస్థ 'చచ్చిపోయింది' అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన విమర్శలపై ప్రధాని నరేంద్ర మోదీ గట్టిగా బదులిచ్చారు. భారత్ త్వరలోనే ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించబోతోందని, విమర్శలకు గణాంకాలే సమాధానం చెబుతాయన్నారు. ట్రినిడాడ్ అండ్ టొబాగో పర్యటనలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచిందని ఆయన స్పష్టం చేశారు. గతంలో ఘనా వంటి దేశాల్లో పర్యటించినప్పుడు కూడా మోదీ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ప్రపంచ వృద్ధిలో భారత్ వాటా దాదాపు 16 శాతంగా ఉందని, స్టార్టప్ వ్యవస్థలో ప్రపంచంలోనే మూడో స్థానంలో నిలిచిందని ఆయన గుర్తుచేశారు. జర్మనీ, జపాన్ వంటి దేశాలను అధిగమించి భారత్ ముందుకు సాగుతున్న తరుణంలో ట్రంప్ విమర్శకులకు ప్రధాని మోదీ ఇలా సమాధానం ఇచ్చారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్థాన్‌తో భారీ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది. దీని కింద ఇరు దేశాలు కలిసి పాకిస్థాన్‌లో 'భారీ చమురు నిల్వలను' అభివృద్ధి చేస్తాయి. గతంలో భారత్‌పై సుంకాల విషయంలో ట్రంప్‌ మాట్లాడుతూ.. భారత్ మిత్ర‌ దేశమని పేర్కొన్నారు. అయినప్పటికీ, సుంకాలలో ఎలాంటి ఉపశమనాన్ని ప్ర‌క‌టించ‌లేదు. ఇప్పుడు ట్రంప్ పాకిస్థాన్‌తో చమురు ఒప్పందం గురించి మాట్లాడుతున్నారు. బహుశా ఏదో ఒక రోజు పాకిస్థాన్ భారత్‌కు చమురు విక్రయించే అవకాశం ఉందని కూడా ఆయన అన్నారు.

Next Story