మోడల్ దారుణ హత్య.. నగ్న శరీరాన్ని టీవీ రూమ్ లో పడేశారు
Pakistani model, 29, strangulated to death at home, naked body found by stepbrother. పాకిస్తాన్‌లో ఓ మోడల్ ను దారుణ హత్యకు గురైంది.
By Medi Samrat
పాకిస్తాన్‌లో ఓ మోడల్ ను దారుణ హత్యకు గురైంది. ఆమె గొంతు కోసి అత్యంత కిరాతకంగా చంపేసి.. నగ్న శరీరాన్ని ఇంట్లో పడేసి వెళ్లారు దుండగులు. చనిపోయిన మోడల్ ను నయాబ్ నదీమ్ గా గుర్తించారు. లాహోర్‌లోని ఆమె నివాసంలో ఈ దారుణం చోటు చేసుకుంది. సవతి సోదరుడి ఫిర్యాదుతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. నిందితులు ఆమె ఇంట్లోకి చొరబడి దారుణంగా హత్య చేశారు. నయాబ్ సవతి సోదరుడిచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
29 ఏళ్ల నయాబ్ లాహోర్‌లోని డిఫెన్స్ ఏరియాలో ఒంటరిగా నివాసం ఉంటున్నారు. శనివారం అర్థరాత్రి ఐస్‌క్రీం తినడానికి బయటకు వెళ్లామని.. ఆ తర్వాత నేను తనను ఆమె ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్లానని నయాబ్ సవతి సోదరుడు నసీర్ తెలిపాడు. ఇంటికి వెళ్లాక నాకు నయాబ్ కాల్ చేసింది. కానీ పడుకుని ఉండటంతో తన కాల్ లిఫ్ట్ చేయలేదు. ఆదివారం ఉదయం తిరిగి తనకు కాల్ చేశాను. లిఫ్ట్ చేయలేదు. తనను చూడటానికి రాగా ఆమె రక్తపు మడుగులో పడి ఉండడం చూసి పోలీసులకు సమాచారం అందించాడు.
గొంతు దగ్గర గాయంతో.. రక్తం మడుగులో నగ్నంగా ఆమె శరీరం కనిపించింది. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో అధికారులు ఘటనా స్థలానికి వచ్చి పరిస్థితిని గమనించారు. నయాబ్ బాత్రూం కిటికి పగిలిపోయి ఉందని పోలీసులు గుర్తించారు. దుండగులు దాని గుండా ఇంట్లో చొరబడి ఆమెను హత్య చేసి ఉంటారని.. ఆమె నగ్న శరీరాన్నీ టీవీ రూంలో పడేశారని పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు.
ఇలాంటి ఘటనలు పాకిస్తాన్ లో చాలానే జరిగాయి. అమ్మాయిలు మోడలింగ్ లో ఉండడం నచ్చని కుటుంబ సభ్యులే దారుణ హత్యలకు పాల్పడిన ఘటనలు గతంలో చోటు చేసుకున్నాయి. ఖందీల్ బలోచ్ అనే పాకిస్తాన్ మోడల్ ను 2016లో సొంత సోదరుడే అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఈ విషయం అప్పట్లో ఎంతో సంచలనం అయింది.