పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో ఓ యువతి ఆహారంలో విషం కలిపి తన కుటుంబంలోని 13 మందిని చంపేసింది. ఆమె ఇష్టం మేరకు పెళ్లి చేసేందుకు అమ్మాయి కుటుంబీకులు సిద్ధంగా లేరు. కోపంతో ఆ అమ్మాయి ఈ స్టెప్ వేసింది. ఖైర్‌పూర్ సమీపంలోని హైబత్ ఖాన్ బ్రోహి గ్రామంలో ఆగస్టు 19న ఈ ఘటన జరిగింది. ఆహారంలో విషం కలిపేందుకు ప్రియుడితో కలిసి యువతి కుట్ర పన్నింది.
ఈ సంఘటన గురించి సమాచారం ఇస్తూ సీనియర్ పోలీసు అధికారి ఇనాయత్ షా మాట్లాడుతూ.. “ఆహారం తిన్న తర్వాత మొత్తం 13 మంది సభ్యులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు, అక్కడ వారందరూ మరణించారు. పోస్టుమార్టం నిర్వహించగా.. విషపూరితమైన ఆహారం తీసుకోవడం వల్లే మృతి చెందినట్లు తేలింది.
పోలీసులు క్షుణ్ణంగా విచారించగా.. కూతురు, ఆమె ప్రేమికుడు ఇంట్లో రొట్టెలు తయారు చేసేందుకు ఉపయోగించే గోధుమపిండిలో విషం కలిపినట్లు తేలింది. పోలీసులు బాలికను ఆదివారం అరెస్టు చేశారు. ప్రియుడి సాయంతో గోధుమ పిండిలో విషం కలిపినట్లు బాలిక అంగీకరించింది.
పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో నిందితురాలిని ఆదివారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆమె ఇష్టానుసారం వివాహం చేసుకోవడానికి ఒప్పుకోవడం లేదని కుటుంబ సభ్యుల ఆహారంలో విషం కలిపి చంపినట్లు పోలీసులు తెలిపారు.