మంగళవారం పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును లక్ష్యంగా చేసుకుని మరోసారి పేలుడు జరిగింది. ఇందులో చాలా మందికి గాయాలయ్యాయి. సింధ్-బలూచిస్థాన్ సరిహద్దు సమీపంలోని సుల్తాన్‌కోట్ ప్రాంతంలో క్వెట్టా వెళ్తున్న రైలుపై ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఈడీ)తో దాడి చేశారు. దీని కారణంగా కనీసం ఆరు కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఈ దాడికి బాధ్యులమని బలూచ్ రిపబ్లికన్ గార్డ్స్ ప్రకటించారు. రైలులో పాక్ ఆర్మీ సైనికులు ప్రయాణిస్తున్నారని పేర్కొన్నారు.
"పాకిస్తానీ ఆర్మీ సైనికులు రైలులో ఉండగా ఈ దాడి జరిగింది. ఈ పేలుడు ఫలితంగా పలువురు సైనికులు మరణించారు.. గాయపడ్డారు. రైలులోని ఆరు కోచ్‌లు పట్టాలు తప్పాయి" అని బలూచ్ రిపబ్లికన్ గార్డ్స్ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, ఎవరి మరణానికి సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు.
బలూచ్ రిపబ్లికన్ గార్డ్స్ కూడా తమ ప్రకటనలో “బలూచిస్తాన్ స్వాతంత్ర్యం పొందే వరకు ఇటువంటి దాడులు కొనసాగుతాయని ప్రకటించింది. "రెస్క్యూ బృందాలు, భద్రతా దళాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సోషల్ మీడియాలో షేర్ చేయబడిన వీడియోలు గాయపడిన వ్యక్తులను చూపించాయి. దాడి తీవ్రతను సూచిస్తున్నాయి.
జాఫర్ ఎక్స్‌ప్రెస్ క్వెట్టా నుండి పెషావర్ వరకు నడుస్తుంది. ఈ ఏడాది చాలాసార్లు ఈ ఎక్స్‌ప్రెస్‌ను టార్గెట్ చేశారు. మార్చిలో బోలన్ ప్రాంతంలో రైలును హైజాక్ చేయడంతో 21 మంది ప్రయాణికులు, నలుగురు భద్రతా సిబ్బంది మరణించారు. ప్రతిగా భద్రతా బలగాలు 33 మంది ఉగ్రవాదులను హతమార్చాయి.