భారత్-పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం ఉద్రిక్తతలు పెరుగుతున్న సంగతి తెలిసిందే!! ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ శనివారం నాడు 450 కి.మీ దూరంలోని లక్ష్యాల్ని ఛేదించగల సర్ఫేస్-టు-సర్ఫేస్ బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు తెలిపింది. అబ్దాలి వెపన్ సిస్టమ్ అని పిలువబడే ఈ క్షిపణిని సైనిక డ్రిల్ 'ఎక్సర్సైజ్ INDUS'లో భాగంగా పరీక్షించినట్లు పాకిస్తాన్ మీడియా నివేదికలు తెలిపాయి.
సోన్మియాని రేంజ్‌లలో ఈ పరీక్షను నిర్వహించారు. పాకిస్తాన్ అణ్వాయుధ సామర్థ్యం గల క్షిపణులను నిర్వహించే ఆర్మీ స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ (ASFC) కింద నిర్వహించిన ఆపరేషనల్ యూజర్ ట్రయల్‌లో భాగమని తెలుస్తోంది. ఈ ప్రయోగాన్ని పాకిస్థాన్ ఆర్మీ స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ముహమ్మద్ షాబాజ్ ఖాన్, స్ట్రాటజిక్ ప్లాన్స్ డివిజన్‌లోని పిడిఎస్ డిజి మేజర్ జనరల్ షెహర్యార్ పర్వేజ్ బట్ వీక్షించారు.