ప్రధానిపై అవిశ్వాసం.. పాక్ అసెంబ్లీ వాయిదా
Pak no trust vote Assembly session adjourned till 1 pm.పొరుగుదేశమైన పాకిస్థాన్‌లో ఇంకా రాజకీయ అనిశ్చితి కొనసాగుతూనే
By తోట వంశీ కుమార్ Published on 9 April 2022 1:00 PM ISTపొరుగుదేశమైన పాకిస్థాన్‌లో ఇంకా రాజకీయ అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై ప్రతి పక్ష పార్టీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఓటింగ్ జరిపేందుకు అస్లెంబ్లీ నేడు(శనివారం) ప్రత్యేకంగా సమావేశమైంది. శనివారం ఉదయం సభ ప్రారంభం కాగానే.. అవిశ్వాసం తీర్మానంపై ఓటింగ్ జరపాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ప్రతిపక్ష నేత షాబాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. సుప్రీం ఆదేశాల ప్రకారం ఇవాళ సభను నడపాలన్నారు. రాజ్యాంగం, చట్టానికి అనుకూలంగా వ్యవహారించాలని స్పీకర్‌ను కోరారు. ఆత్మసాక్షిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు.
అనంతరం స్పీకర్ అసద్ ఖైసర్ మాట్లాడుతూ.. పాకిస్థాన్‌పై జరిగిన అంతర్జాతీయ కుట్ర గురించి కూడా చర్చించాలన్నారు. ఆ సమయంలో విపక్ష సభ్యలు నినాదాలు చేశారు. ఎలాంటి చర్చ జరపాల్సిన అవసరం లేదన్నారు. ఈ క్రమంలో పాక్ విదేశాంగ మంత్రి, పీటీఐ నేత షా మహమ్మద్ ఖురేషి మాట్లాడుతూ.. విదేశీ కుట్రపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో మరోసారి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో స్పీకర్ సభను మధ్యాహ్నాం 1 గంటకు వాయిదా వేశారు.
పాక్ అసెంబ్లీలో మొత్తం 342 మంది సభ్యులున్నారు. ఇమ్రాన్ అవిశ్వాసం నెగ్గాలంటే 172 మంది సభ్యుల మద్దు అవసరం. అయితే.. అధికార పార్టీకి 164 బలం మాత్రమే ఉండగా.. ప్రతిపక్ష బలం 177గా ఉంది. దీంతో ఇమ్రాన్ తన పదవికి రాజీనామా చేసే అవకాశం ఉంది.