ఈశాన్య చైనాలోని లియోనింగ్ ప్రావిన్స్‌లోని షెన్యాంగ్ సిటీలో శనివారం బస్సు పేలిన ఘటనలో కనీసం ఒకరు మృతి చెందగా, 42 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. షెన్యాంగ్‌లోని హువాంగ్ జిల్లాలోని హువాంగ్ స్ట్రీట్, నింగ్‌షాన్ రోడ్ జంక్షన్ వద్ద ఈ సంఘటన జరిగిందని స్థానిక పోలీసులు తెలిపారు. ఘటనకు గల కారణాలపై విచారణ జరుపుతున్నారు. ఆన్‌లైన్‌లో సర్క్యులేట్ అవుతున్న ఫుటేజీ, రోడ్డు పక్కన ఉన్న వాహనం చుట్టూ శిధిలాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. బస్సు కిటికీలు పగిలిపోయాయి.
పేలుడు సంభవించినప్పుడు తమకు పెద్ద శబ్ధం వినిపించిందని, అయితే బస్సులో మంటలు చెలరేగలేదని సాక్షులు చెప్పారని ఆ దేశ మీడియా పేర్కొంది. లియానింగ్ ప్రావిన్స్‌లోని షెన్యాంగ్ నగరంలో జరిగిన పేలుడులో ఒకరు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు స్థానిక పబ్లిక్ సెక్యూరిటీ బ్యూరో ఒక ప్రకటనలో తెలిపింది. మరో 40 మందికి స్వల్ప గాయాలైనట్లు షెన్యాంగ్ అధికారులు తెలిపారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న మరో వీడియో క్లిప్‌లో, పేలుడు తరువాత ప్రజలు బస్సు దగ్గర రోడ్డు పక్కన కూర్చున్నట్లు కనిపిస్తున్నారు. పేలుడుకు గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.