శర వేగంగా ఓమిక్రాన్‌ వ్యాప్తి.. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌ వార్నింగ్‌

Omicron spreading at unprecedented rate. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్‌ శరవేగంగా వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. 77 దేశాల్లో ఓమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు

By అంజి  Published on  15 Dec 2021 10:11 AM IST
శర వేగంగా ఓమిక్రాన్‌ వ్యాప్తి.. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌ వార్నింగ్‌

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్‌ శరవేగంగా వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. 77 దేశాల్లో ఓమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు నమోదు అయ్యాయని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ఈ సందర్భంగా డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రోస్‌ అధనమ్‌ గెబ్రియాసిసి్‌ మాట్లాడారు. ఇంకా చాలా దేశాల్లో ఓమిక్రాన్‌ వేరియంట్‌ను గుర్తించే పనిలో ఉన్నారని అన్నారు. అయితే ఈ కొత్త వేరియంట్‌ను అదుపు చేసేందుకు ఆయా దేశాల ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోవడం లేదని టెడ్రోస్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

వైరస్‌ను అంచనా వేయడంలో విఫలం అయ్యమని చెప్పారు. ఓమిక్రాన్‌ కేసులు పెరుగుదలతో మళ్లీ ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆయన చెప్పారు. కొత్త వేరియంట్‌ను ఓమిక్రాన్‌ను తొలిసారిగా నవంబర్‌లో దక్షిణాఫ్రికా దేశంలో గుర్తించారని, ఆ దేశ అధ్యక్షుడు సిరిల్‌ రామఫోసాకు కూడా కరోనా పాజిటివ్‌ వచ్చిందని చెప్పారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో ప్రపంచ వ్యాప్తంగా అసమానతలు ఉన్నాయని చెప్పారు. కొన్ని దేశాలకు ఇంకా వ్యాక్సిన్లు అందలేదని, ఈ సమయంలోనే కొన్ని దేశాలు బూస్టర్ డోసులు ఇస్తున్నాయని చెప్పారు.

మరో వైపు భారత్‌లో కొత్తగా 6,984 కరోనా కేసులు నమోదు అయ్యాని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మహమ్మారి సోకి మరో 247 మంది చనిపోయారు. గడిచిన 24 గంటల్లో 8,168 మంది కరోనా బారి నుండి కోలుకున్నారు. దీంతో దేశంలో ప్రస్తుతం కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 87,562గా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు భారత్‌లో 134.61 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసుల పంపిణీ జరిగింది.


Next Story