భార్య కళ్ల ముందే భారతీయుడిని కాల్చి చంపారు

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన 29 ఏళ్ల వ్యక్తిని అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో అతడి భార్య ముందే కాల్చి చంపారని కుటుంబ సభ్యులు తెలిపారు

By Medi Samrat  Published on  21 July 2024 8:30 PM IST
భార్య కళ్ల ముందే భారతీయుడిని కాల్చి చంపారు

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన 29 ఏళ్ల వ్యక్తిని అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో అతడి భార్య ముందే కాల్చి చంపారని కుటుంబ సభ్యులు తెలిపారు. అమెరికా పోలీసుల దర్యాప్తులో లోపం ఉందని ఆరోపించిన కుటుంబ సభ్యులు నిందితులను కఠినంగా శిక్షించాలని, గవిన్‌కు న్యాయం చేయాలని కోరారు. అమెరికాలో వివాహం చేసుకున్న గవిన్ దసౌర్ మెక్సికన్ సంతతికి చెందిన తన భార్యతో కలిసి ఇంటికి వెళ్తుండగా జూలై 16న ఈ ఘటన జరిగింది. ఓవర్‌టేక్ చేయడంపై గవిన్, పికప్ ట్రక్ డ్రైవర్‌కు మధ్య వివాదం చెలరేగింది, ఆ తర్వాత ట్రక్ డ్రైవర్ అతనిపై కాల్పులు జరిపాడని గవిన్ కుటుంబీకులు తెలిపారు.

చనిపోయిన యువకుడు ఇండియాలోని ఆగ్రాకు చెందిన వాడు. రెండు వారాల క్రితమే వివాహం జరిగింది. గవిన్ డసౌర్(29) అమెరికాలోని ఇండియానాలో నివాసం ఉంటున్నాడు. జూన్ 29 న మెక్సికన్ యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో కిందటి మంగళవారం ఇండియానాలోని ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద మరో వాహనదారుడితో గవిన్ గొడవపడ్డాడు. మరో కారులో ఉన్న అమెరికన్ పైకి తుపాకీతో వెళ్లాడు. కారు డోర్ ను కొడుతూ అమెరికన్ పై అరవడం వీడియోలో కనిపిస్తోంది. గవిన్ అరుపులకు బదులుగా సదరు అమెరికన్ తన తుపాకీ తీసి గన్ పాయింట్ లో కాల్పులు జరిపాడు. ఇదంతా పక్కనే ఉన్న మరో డ్రైవర్ తన సెల్ ఫోన్ కెమెరాలో రికార్డు చేశాడు. బుల్లెట్ గాయాలతో కుప్పకూలిన గవిన్ ను ఆయన భార్య ఆసుపత్రిలో చేర్పించింది. పరిస్థితి విషమించడంతో గవిన్ కన్నుమూశాడు.

Next Story