షాకింగ్ : ఎలుక కొరకడంతో ఆ దేశంలో మొదలైన కరోనా ఉధృతి

Mouse with Covid sparks Taiwan lab alert after biting scient. తైవాన్‌లోని అత్యంత కట్టుదిట్టమైన బయో-సేఫ్టీ ల్యాబరేటరీలోని ఓ సైంటిస్ట్‌కు ఎలుక

By Medi Samrat  Published on  10 Dec 2021 2:04 PM GMT
షాకింగ్ : ఎలుక కొరకడంతో ఆ దేశంలో మొదలైన కరోనా ఉధృతి

తైవాన్‌లోని అత్యంత కట్టుదిట్టమైన బయో-సేఫ్టీ ల్యాబరేటరీలోని ఓ సైంటిస్ట్‌కు ఎలుక కరవడంతో కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తైవాన్‌లోని టాప్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ అకాడెమియా సినికా అనే జన్యుక్రమ విశ్లేషణ సంస్థలో పనిచేస్తున్న 20 ఏళ్ల మహిళకు వైరస్ సోకినట్లు తేలిందని అక్కడి ఆరోగ్య మంత్రి చెన్ షిహ్-చుంగ్ బ్రీఫింగ్ తెలిపారు. తైవాన్‌లో కొత్తగా కోవిడ్-19 వ్యాప్తికి సంబంధించిన పరిశోధనలో ఎలుక కాటు కేంద్రంగా ఉంది. హై-సెక్యూరిటీ లాబొరేటరీలో ఒకరికి ద్వీపంలో మొదటి స్థానిక కేసుగా నిర్ధారించబడింది. ల్యాబ్ వర్కర్ 20 ఏళ్ల మహిళ అని తేలింది. నవంబర్ మధ్యలో తైవాన్‌లోని అత్యున్నత పరిశోధనా సంస్థ అకాడెమియా సినికాలో ఆమె పని చేస్తున్నప్పుడు వైరస్‌ ఆమెకు సంక్రమించింది.

ఆ తరువాత కోవిడ్‌కు పాజిటివ్ పరీక్షించినట్లు ఆరోగ్య మంత్రి చెన్ షిహ్-చుంగ్ చెప్పారు. గురువారం సాయంత్రం ఈ ఘటనపై బ్రీఫింగ్ నిర్వహించారు. ఆమె ఇటీవల విదేశాలకు వెళ్లలేదు, Moderna Inc. టీకా రెండు మోతాదులను తీసుకుంది. మరొక సీనియర్ అధికారి కూడా ల్యాబొరేటరీలో ఎలుక కరిచిందని అన్నారు. అయితే వైరస్ వ్యాప్తికి మూలం కాటు కాదా అని నిర్ధారించడానికి తదుపరి దర్యాప్తు అవసరమని చెప్పారు. తైవాన్ అధికారులు ఆమెకు డెల్టా వేరియంట్ సోకినట్లు భావిస్తున్నారు. కోవిడ్ వ్యాప్తిని అరికట్టడంలో తైవాన్ సాధించిన విజయం కాస్తా ఇప్పుడు ప్రమాదంలో పడింది. గత నెల రోజులుగా ద్వీప దేశంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. చివరి సారిగా నవంబర్‌ 5న పాజిటివ్‌ నమోదైంది. తాజాగా ఎలుక కరవడంతో తొలి కేసు నమోదైంది.


Next Story