కడుపులో 6 నెలలుగా మొబైల్‌ ఫోన్‌.. సిగ్గుతో..

Mobile phone in stomach. ఆ వ్యక్తి మొబైల్‌ ఫోన్‌ మింగాడు. డాక్టర్ వద్ద వెళ్లడానికి సిగ్గుపడ్డాడు. మలద్వారం ద్వారా బయటకు వస్తుందిలే

By అంజి  Published on  21 Oct 2021 2:30 AM GMT
కడుపులో 6 నెలలుగా మొబైల్‌ ఫోన్‌.. సిగ్గుతో..

ఆ వ్యక్తి మొబైల్‌ ఫోన్‌ మింగాడు. డాక్టర్ వద్ద వెళ్లడానికి సిగ్గుపడ్డాడు. మలద్వారం ద్వారా బయటకు వస్తుందిలే అనుకున్నాడు. అది ఎంతకు రాకపోక.. తీవ్ర కడుపు నొప్పితో వేధించింది. ఈజిప్ట్‌లోని ఆస్వాన్‌కు చెందిన ఓ వ్యక్తి చేసిన పని ఇది. ఫోన్‌ మింగడంతో లోపల శరీర అవయవాడు దెబ్బతిన్నాయి. తీవ్రమైన కడుపు నొప్పితో ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. చివరికి వైద్యుల దగ్గరకి వెళ్లక తప్పలేదు. ఎక్స్‌రే తీసి కడుపులో ఉన్న మొబైల్‌ ఫోన్‌ను వైద్యులు గుర్తించి ఆశ్చర్యపోయారు.

మొబైల్‌ ఫోన్‌ మింగడంతో ఆ వ్యక్తి కడుపు, ప్రేగులలో తీవ్రమైన ఇన్ఫెక్షన్లు ఉన్నట్లు తెలిసింది. ఎక్స్‌-రే రిపోర్ట్‌లో ఆరు నెలల క్రితం ఫోన్‌ను మింగినట్లు తెలిసింది. ఆ తర్వాత ఆస్వాన్‌ యూనివర్సిటీ ఆస్పత్రి వైద్యులు శస్త్రచికిత్స చేసి ఫోన్‌ను బయటకు తీశారు. ఆస్వాన్‌ యూనివర్సిటీ ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అష్రఫ్ మాబాద్‌ మాట్లాడుతూ.. 6 నెలల క్రితం రోగి మింగిన పరికరం.. అతని శరీరాన్ని ఆహారం తీసుకోకుండా నిరోధించిందని, అయితే వైద్యులు శస్త్రచికిత్స చేయడం ద్వారా అతని ప్రాణాలు కాపాడామని, ఇప్పుడు అతను కోలుకుంటున్నాడని చెప్పారు.

Next Story