పాపం ట్రంప్‌.. అధ్య‌క్ష పీఠం పొయింద‌నుకునుంటే.. ఇప్పుడు విడాకులు కూడానా..!

Melania Trump divorce from Donald Trump. అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిశాయి. కొత్త అధ్యక్షుడిగా జోబైడెన్ ఎన్నికయ్యాడు.

By Medi Samrat  Published on  13 Nov 2020 3:04 AM GMT
పాపం ట్రంప్‌.. అధ్య‌క్ష పీఠం పొయింద‌నుకునుంటే.. ఇప్పుడు విడాకులు కూడానా..!

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిశాయి. కొత్త అధ్యక్షుడిగా జోబైడెన్ ఎన్నికయ్యాడు. వచ్చే ఏడాది జనవరిలో పదవిని అధిష్టించేందుకు ఇప్పటినుంచే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే.. వైట్‌హౌస్ వీడిన మ‌రుక్ష‌ణ‌మే ట్రంప్‌కు మెలానియా విడాకులు ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. డొనాల్డ్‌ ట్రంప్‌, మెలానియా మధ్య భార్యాభర్తల బంధమే లేదని, అవసరం కోసం కలిసి బతికేస్తున్నారని ట్రంప్‌ మాజీ రాజకీయ సహాయకురాలు ఒమరోసా న్యూమ్యాన్ చెప్పారు.

విడాకుల విష‌యానికి వ‌స్తే.. ఒక‌టీ కాదు రెండూ కాదు. ఏకంగా 500 కోట్లు. అంటే 68 మిలియ‌న్ల డాల‌ర్లు ప‌రిహారం ఇవ్వాల్సి వ‌స్తుంద‌ని న్యాయ నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. ఇవాంక ఈవిడకి పుట్టిన బిడ్డ‌ కాదు. వీళ్ల పెళ్లికి ఆమె రీజ‌నూ కాదు. కానీ.. విడాకుల‌కి మాత్రం ఆమే రీజ‌న్ అంటున్నారు. ట్రంపు మ‌న దేశం వ‌స్తే ఎంత హ‌డావిడి జ‌రిగిందో చూశాం క‌దా. మామూలుగా అయితే.. అమెరికా ప్రెసిడెంట్ తో పాటు.. ఫ‌స్ట్ లేడీగా ఆయ‌న భార్య కూడా ప్ర‌పంచ దేశాల విజిట్ కి వెళ్తుంటారు.

కానీ.. ట్రంపు ఆయ‌న భార్య‌తో వ‌స్తాడో లేదో కానీ.. ఇవాంక మాత్రం ఏలు ప‌ట్టుకునే వ‌స్తుందంట‌. ఇక వైట్ హౌజ్ లో కూడా అంతా ఆమె ఇష్టారాజ్య‌మేన‌ట‌. జ‌స్ట్ మెలానియా బొమ్మ‌లా మాత్ర‌మే ఉండేవార‌ట‌. అందుకే.. విడాకుల దాకా వ‌చ్చింది ఎవ్వారం అనే టాకుంది. ట్రంపుకి, మెలానియాకి ఓ బాబున్నాడు. ఆ బాబుకి ప‌ద్నాలుగేళ్లు. ఆ బాబుపై ఇద్ద‌రికీ ఉండే హ‌క్కుల‌పై కూడా మాట్లాడుకుంటున్నార‌ట‌.

డొనాల్డ్‌ ట్రంప్‌కు మెలానియా మూడవ భార్య. ట్రంప్‌ మాజీ భార్యల కంటే ఇప్పుడు మెలానియాకు చాలా ఎక్కువ మొత్తంలో భరణం అందబోతుందని న్యాయనిపుణులు భావిస్తున్నారు. ఫోర్బ్స్‌ నివేదిక ప్రకారం డొనాల్డ్‌ ట్రంప్‌ సంపద 250 కోట్ల డాలర్లు. మొదటి భార్యకు 14 మిలియన్‌ డాలర్లతోపాటు కనెక్టికట్‌లో ఒక భవనం, న్యూయార్క్‌లో అపార్ట్‌మెంట్‌ కూడా దక్కాయి. రెండవ భార్యకు 2మిలియన్‌ డాలర్లు భరణం కింద అందగా.. ఇప్పుడు మెలానియాకు మాత్రం వారిద్దరి కంటే ఎక్కువగా భరణం అందే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు.

న్యూమాన్ రాడ్ మేనేజింగ్ భాగస్వామి జాక్వెలిన్ న్యూమాన్ లెక్కల ప్రకారం ఇప్పటికిప్పుడు మెలానియా విడాకులు తీసుకున్నపక్షంలో ఆమెకు ట్రంప్‌ ఆస్తి నుంచి 68 మిలియన్‌ డాలర్లు అంటే.. భారతీయ కరెన్సీలో రూ.507 కోట్లకుపైగా అందనున్నాయి. వీరి కుమారుడు బారన్‌కు 14 ఏండ్లు కావడంతో మెలానియాకు దక్కే ప్రాథమిక కస్టోడియన్‌ హక్కులన్నీ బారన్‌కు కూడా దక్కుతాయి. దాంతో భారీ మొత్తంలో భరణంతోపాటు కుమారుడి సంక్షేమానికి కూడా ట్రంప్‌ ఆస్తి ఇవ్వాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు చెప్తున్నారు.


Next Story