నేను పాకిస్థాన్ నుండి వచ్చేస్తున్నా

Married Indian woman Anju who went to Pak to meet Facebook friend set to come back. ఫేస్‌బుక్‌లో స్నేహం చేసి స్నేహితుడిని కలిసేందుకు భారతీయ మహిళ పాకిస్థాన్‌లోని వాయువ్య ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌కు వెళ్లినట్లు

By Medi Samrat  Published on  24 July 2023 3:30 PM GMT
నేను పాకిస్థాన్ నుండి వచ్చేస్తున్నా

ఫేస్‌బుక్‌లో స్నేహం చేసి స్నేహితుడిని కలిసేందుకు భారతీయ మహిళ పాకిస్థాన్‌లోని వాయువ్య ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌కు వెళ్లినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. 34 ఏళ్ల అంజు ఉత్తరప్రదేశ్‌లోని కైలోర్ గ్రామంలో జన్మించింది. రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో నివసించింది. ఆమె ఇప్పుడు ఫేస్‌బుక్ స్నేహితుడు నస్రుల్లాను కలవడానికి పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలోని అప్పర్ దిర్ జిల్లాలో ఉంది. వైద్య రంగంలో పనిచేస్తున్న నస్రుల్లా, అంజు కొన్ని నెలల క్రితం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్‌లో స్నేహితులయ్యారని మీడియా తెలిపింది. అంజు పాకిస్తాన్‌ని చూడటానికి వచ్చిందని.. అతన్ని పెళ్లి చేసుకోవడానికి కాదని అక్కడి పోలీసులు కూడా తెలిపారు.

నస్రుల్లా ఈ ఘటనపై స్పందించారు. ఇందులో ప్రేమ కోణం ఏమీ లేదని, అంజు తిరిగి భారత్ వెళ్లిపోతుందని పాక్ జాతీయుడు వెల్లడించాడు. భారతీయ మహిళ అంజును పెళ్లి చేసుకునే ఆలోచనేదీ తనకు లేదని నస్రుల్లా స్పష్టం చేశాడు. నస్రుల్లా ఓ సైన్స్ గ్రాడ్యుయేట్. షెరింగల్ వర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పుచ్చుకున్నాడు. అతడిది పెద్ద కుటుంబం. ఐదుగురు సోదరుల్లో అందరికంటే చిన్నవాడు. 2019 నుంచి అంజు, నస్రుల్లా మధ్య ఫేస్ బుక్ ఫ్రెండ్షిప్ కొనసాగుతోంది.

ఓ మీడియా సంస్థతో అంజూ మాట్లాడింది.. నేను పాకిస్థాన్‌లో ఉన్నాను.. ప్రస్తుతం మనాలి లాంటి పర్వత ప్రాంతంలో నేను సురక్షితంగా ఉన్నానని ఆమె చెప్పింది. పాకిస్థాన్ వెళ్లే విషయం ఎవరికీ ఏమీ చెప్పలేదని.. తాను కేవలం జైపూర్‌ మాత్రమే వెళుతున్నానని చెప్పానని అంజూ తెలిపింది. అన్ని చట్టపరమైన విధానాలను అనుసరించిన తర్వాతనే పాకిస్థాన్ కు వెళ్లానని.. ఇక్కడ ఒక పెళ్లి కోసం వచ్చానని చెప్పింది. వాఘా బోర్డర్ నుంచి పాకిస్థాన్ చేరుకున్నానని.. ముందుగా ఢిల్లీకి వచ్చానని తెలిపింది. ఆ తర్వాత నేను అమృత్‌సర్‌కు వెళ్ళా, వాఘా బోర్డర్‌కు వెళ్లి అక్కడి నుంచి పాకిస్థాన్‌లోకి ప్రవేశించానని తెలిపింది. నన్ను సీమ హైదర్‌తో పోల్చడం తప్పు. నేను తిరిగి వస్తాను. ఇక్కడ పూర్తిగా సురక్షితంగా ఉన్నానని చెప్పుకొచ్చింది అంజూ. నస్రుల్లాను పెళ్లి చేసుకునేందుకు పాకిస్థాన్ కు వెళ్ళలేదు. నాకు నస్రుల్లా రెండు మూడు సంవత్సరాలుగా తెలుసు. మొదటిరోజే ఈ విషయం మా అక్క, అమ్మలకు చెప్పాను. ఇక మొదటి నుంచి నాకు నా భర్త మధ్య మంచి సంబంధాలు లేవు. కొన్ని పరిస్థితుల వల్ల అతని దగ్గరే ఉంటున్నాను. నా పిల్లల కోసం నేను అతడితో ఉంటున్నానని తెలిపింది.


Next Story