అమెరికాలోని పోర్ట్‌ల్యాండ్‌లో మైనే, న్యూ హాంప్‌షైర్‌లోని సూపర్ మార్కెట్‌లలోని పిజ్జా తడి పిండిలో రేజర్ బ్లేడ్‌లు, స్క్రూలను ఉంచిన ఓ వ్యక్తికి కోర్టు గురువారం 4 సంవత్సరాల తొమ్మిది నెలల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో నిందితుడు 2020లో అరెస్ట్ అయ్యాడు. న్యూ హాంప్‌షైర్‌లోని డోవర్‌కు చెందిన నికోలస్ మిచెల్ అనే 39 ఏళ్ల వ్యక్తి.. తాను నేరం చేసినట్లు కోర్టులో అంగీకరించాడు. ఈ క్రమంలోనే కోర్టు జైలు శిక్ష విధించింది. జైలు శిక్షతో పాటు అతను హన్నాఫోర్డ్ సూపర్ మార్కెట్‌లకు దాదాపు 2.30 లక్షల డాలర్లు నష్టపరిహారంగా చెల్లించాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. కాగా నిందితుడు మిచెల్ తన చర్యలకు కన్నీళ్లతో కోర్టులో క్షమాపణలు చెప్పాడు.
సాకోలోని హన్నాఫోర్డ్ స్టోర్‌లో విక్రయించే పిజ్జా పిండిలో రేజర్ బ్లేడ్‌లు కనిపించడంతో మిచెల్‌ను అక్టోబర్ 2020లో అరెస్టు చేశారు. ముగ్గురు కస్టమర్లు పిజ్జా పిండిలో దాచిన బ్లేడ్‌లను కనుగొన్నారని ప్రాసిక్యూటర్లు తెలిపారు. నిందితుడు మిచెల్ ఇట్ విల్ బి పిజ్జా యొక్క మాజీ ఉద్యోగి. శాన్‌ఫోర్డ్, మైనే, న్యూ హాంప్‌షైర్‌లోని హన్నాఫోర్డ్ స్టోర్‌లలో కూడా పిజ్జా పిండిలో ట్యాంపరింగ్ జరిగిందని తెలిసింది. ఈ నేపథ్యంలోనే స్థానిక పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే మహమ్మారి కరోనా సమయంలో నిందితుడు మిచెల్ జీవితం అదుపు తప్పిందని, అతని స్నేహితురాలు హెయిర్ సెలూన్‌ను కోల్పోయిందని, మిచెల్ గృహ కలహాల కారణంగా అరెస్టయ్యాడని, అతను నిరాశ్రయుడయ్యాడని కోర్టు పత్రాలు సూచించాయి.