ఆ సినిమాలోని జోకర్‌లా డ్రెస్‌ వేసుకొని.. రైల్లోని ప్రయాణికులపై కత్తితో దాడి..!

Man arrested for attacking Tokyo train. అది ఎప్పుడూ బిజీగా ఉండే రైల్వే స్టేషన్‌.. అక్కడ ఆగి ఉన్న రైలులోని ఓ బోగీలో ఆగంతకుడు చేసిన పనితో ప్రయాణికులు

By అంజి  Published on  1 Nov 2021 11:09 AM IST
ఆ సినిమాలోని జోకర్‌లా డ్రెస్‌ వేసుకొని..  రైల్లోని ప్రయాణికులపై కత్తితో దాడి..!

అది ఎప్పుడూ బిజీగా ఉండే రైల్వే స్టేషన్‌.. అక్కడ ఆగి ఉన్న రైలులోని ఓ బోగీలో ఆగంతకుడు చేసిన పనితో ప్రయాణికులు ఒక్కసారిగా అరుపులు, కేకలతో బెంబేలెత్తారు. కొందరు రైలు కిటీకీల గుండా బయటకు పరుగులు తీస్తే... మరికొందరు పక్క బోగీల్లోకి వెళ్లడం ప్రారంభించారు. వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం సాయంత్రం జపాన్‌లో రాజధాని టోక్యలో గల కేయె లైన్‌లో ఆగి ఉన్న రైలులోకి బ్యాట్‌మ్యాన్‌ సినిమాలో ఉండే జోకర్‌లా వేషం వేసుకున్న ఓ 24 ఏళ్ల వ్యక్తి ప్రవేశించి.. ప్రయాణికులపై కత్తితో దాడి చేశాడు. ఆ తర్వాత రైలులో పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఓ దినపత్రిక కథనం ప్రకారం.. 24 ఏళ్ల క్యోటా హట్టోరి నిందితుడికి బ్యాట్‌మ్యాన్‌ సినిమాలోని జోకర్‌ పాత్ర ఇష్టమని, అతడు చాలా మందిని చంపి మరణశిక్ష పొందాలనుకున్నాడని పోలీసులు తెలిపారని చెప్పింది. సిటీ సెంటర్‌లోకి హాలోవీన్‌ సమావేశాల కోసం వెళ్తుండగా ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో 17 మంది గాయపడ్డారు. ఓ 60 వృద్థుడు నిందితుడి కత్తిపోట్లకు గురయ్యాడు. అతని పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. '' ఇది హాలోవీన్‌ స్టంట్‌ అని నేను అనుకున్నాను అంటూ ఓ సాక్షి అక్కడి మీడియతో చెప్పాడు. ప్రయాణికులు భయంతో పరుగులు పెట్టారు, అప్పుడే ఓ వ్యక్తి నెమ్మదిగా పొడవాటి కత్తిని ఊపడాన్ని గమనించానని, కత్తిపై రక్తం ఉందని చెప్పాడు.

'' దాడి సమయంలో నిందితుడు ఎలాంటి భావోద్వేగాన్ని ప్రదర్శించలేదని ఓ మహిళా ప్రయాణికురాలు తెలిపింది. ఈ ఘటనను ప్రభుత్వ అధికార ప్రతినిధి హిరోకాజు మట్సునో.. దారుణమైన, క్రూరమైన సంఘటనగా అభివర్ణించారు.

Next Story