చైనాతో సైనిక ఒప్పందం చేసుకున్న మాల్దీవులు

మాల్దీవులు, చైనా దేశాలు సైనిక ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందాలు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలలో

By Medi Samrat  Published on  5 March 2024 1:31 PM GMT
చైనాతో సైనిక ఒప్పందం చేసుకున్న మాల్దీవులు

మాల్దీవులు, చైనా దేశాలు సైనిక ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందాలు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతాయని ఇరు దేశాల అధికారులు తెలిపారు. సోమవారం నాడు మాలేలో మాల్దీవుల రక్షణ మంత్రి ఘసన్ మౌమూన్, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఇంటర్నేషనల్ మిలిటరీ కోఆపరేషన్ కార్యాలయం డిప్యూటీ డైరెక్టర్ మేజర్ జనరల్ జాంగ్ బావోకున్ సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. ఆ తర్వాత సైనిక ఒప్పందాలపై సంతకాలు చేశారు. చైనా ఎటువంటి ఖర్చు లేకుండా మాల్దీవులకు సైనిక సహాయం అందించడానికి ప్రతిజ్ఞ చేసింది.

మాల్దీవుల అధ్యక్షుడుగా ముయిజ్జు ప్రమాణస్వీకారం చేసిన తర్వాత భారత్ మీద విషం కక్కుతూనే ఉన్నాడు. మహమ్మద్ ముయిజ్జు భారత దేశంపై మరోసారి నోరు పారేసుకున్నాడు. మాల్దీవుల భూభాగంలో మే 10 తర్వాత భారత మిలిటరీ సిబ్బంది ఒక్కరు కూడా ఉండొద్దని.. కనీసం సివిల్ డ్రెస్సుల్లో కూడా తిరగకూడదని అన్నారు. మాల్దీవుల భూభాగంలోని మూడు వైమానిక స్థావరాల్లో భారత బలగాలు విధులు నిర్వర్తిస్తున్నాయి. ఒక స్థావరం నుంచి మార్చి 10 లోగా, మరో రెండు స్థావరాల నుంచి మే 10 లోగా ఖాళీ చేయాలని మాల్దీవుల ప్రభుత్వం భారత ప్రభుత్వాన్ని ఇప్పటికే సూచించింది.

Next Story