చిలీలో 6.1 తీవ్రతతో భారీ భూకంపం

దక్షిణ అమెరికా దేశం చిలీలో భూకంపం సంభవించింది. అందిన‌ సమాచారం ప్రకారం..

By Medi Samrat  Published on  3 Jan 2025 8:59 AM IST
చిలీలో 6.1 తీవ్రతతో భారీ భూకంపం

దక్షిణ అమెరికా దేశం చిలీలో భూకంపం సంభవించింది. అందిన‌ సమాచారం ప్రకారం.. చిలీ స్థానిక కాలమానం ప్రకారం 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే, భూకంపం కారణంగా చిలీ ప్రభావిత ప్రాంతంలో ఎంత నష్టం వాటిల్లింది అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) ప్రకారం.. చిలీలోని ఆంటోఫాగస్టాలో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం 104 కిలోమీటర్ల (64.62 మైళ్లు) లోతులో ఉన్నట్లు EMSC నివేదించింది. చరిత్రలో ఇప్పటివరకు అత్యధిక తీవ్రత కలిగిన భూకంపం చిలీలో మాత్రమే నమోదైంది.

అత్య‌ధికంగా భూకంపాలు సంభవించే దేశాలలో చిలీ ఒకటి, ఇక్కడ ప్లేట్ టెక్టోనిక్స్ కారణంగా తరచుగా భూకంపాలు సంభవిస్తాయి. చరిత్రలో ఇక్కడ చాలా తీవ్రమైన భూకంపాలు నమోదయ్యాయి. 1960లో వాల్డివియాలో 9.5 తీవ్రతతో సంభవించిన భూకంపం ఇప్పటివరకు అతిపెద్ద భూకంపం. అదేవిధంగా, 2010లో 8.8 తీవ్రతతో సంభవించిన భూకంపం భారీ వినాశనానికి కారణమైంది.

చిలీ ప్రభుత్వం,విపత్తు నిర్వహణ సంస్థలు పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాయి. ప్రభావిత ప్రాంతంలో సహాయ బృందాలను మోహరించారు. పౌరులు సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని, అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని, ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించాలని సూచించారు.

Next Story