ముగిసిన 'మా' ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ.. మొదలైన కౌంటింగ్

MAA Election Voting Completed. ‘మా’ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ ముగిసింది. ‘మా’ చరిత్రలోనే అత్యధిక పోలింగ్‌ నమోదైంది.

By Medi Samrat  Published on  10 Oct 2021 10:46 AM GMT
ముగిసిన మా ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ.. మొదలైన కౌంటింగ్

'మా' ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ ముగిసింది. 'మా' చరిత్రలోనే అత్యధిక పోలింగ్‌ నమోదైంది. మధ్యాహ్నం 3గంటల సమయానికి 626 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 60 ఉన్నాయ‌ని తెలుస్తున్న క్ర‌మంలో మొత్తం లెక్కించాల్సిన ఓట్లు 686. ఇదిలావుంటే.. మొత్తం 925మంది 'మా' సభ్యులు ఉండగా, అందులో 883మందికి ఓటు హక్కు ఉంది. ప్రస్తుతం క్యూలైన్‌లో ఉన్నవారికి ఓటు వేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. నటి, యాంకర్‌ అనసూయ చివరి నిమిషంలో తన ఓటు వేశారు.

ఓటింగ్‌పై మా అధ్యక్ష అభ్యర్థి ప్రకాశ్‌రాజ్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఎన్నుకోవడం జరిగితేనే మంచిదని, ప్రస్తుతం ఓటు వేయడానికి వస్తున్న వారిని చూస్తే సంతోషంగా ఉందని అన్నారు. పోలింగ్‌ కేంద్రం వద్ద మీడియాతో మాట్లాడారు. 'అందరూ నవ్వుతూ వచ్చారు. కౌగిలించుకున్నారు. విజయ సంకేతం చూపించారు. అకారణ శతృత్వం ఎవరికీ వద్దని అన్నారు. ఇదిలావుంటే.. కొద్దిసేప‌టి క్రితం మా ఎలక్షన్స్ కౌంటింగ్ మొదలైంది. ముందుగా 18 మంది కమిటీ మెంబ‌ర్ల‌ ఓట్ల లెక్కింపు జ‌రుగుతుంది. చివరగా ప్రెసిడెంట్ ఓట్ల కౌంటింగ్ చేస్తారు. ప్రెసిడెంట్ ఫలితం రాత్రి 8 గంటల తర్వాత వెలువ‌డుతుంద‌ని స‌మాచారం.


Next Story