అమెరికా మా ప్రధాన శత్రువు అంటున్న కిమ్
Kim Jong Un unveils new submarine-launched missile as Trump leaves office. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ దూకుడు
By Medi Samrat Published on 15 Jan 2021 7:27 AM GMTఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ దూకుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచం మొత్తానిది ఒక తీరు.. నాది మరో తీరు అనడం కిమ్ కు అలవాటే..! అమెరికా మీద ఎప్పటి నుండో కిమ్ కోపాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. అందుకు తగ్గట్టుగానే ఈ మధ్య కాలంలో ట్రంప్ అనుసరించిన తీరు కూడా అలానే ఉంది. ఇక ట్రంప్ దిగిపోయి కొత్త అధ్యక్షుడిగా జో బైడెన్ బాధ్యతలు తీసుకుంటున్న సమయంలో అమెరికాను తమ దేశ ప్రధాన శత్రువుగా పేర్కొంటూ కిమ్ జోంగ్ ఉన్ సంచలన ప్రకటన చేశారు. కొత్తగా ఆవిష్కరించిన సబ్‌మెరైన్ లాంచ్ బాలిస్టిక్ మిస్సైల్ ప్రదర్శనని పరిశీలించాక కిమ్ ఈ వ్యాఖ్యలు చేశారని మీడియా చెబుతోంది. తమ భూభాగం వెలుపల ముందస్తుగా శత్రువులను గుర్తించి, వారిని పూర్తిగా నాశనం చేసే శక్తిమంతమైన రాకెట్లు తమ వద్ద ఉన్నాయని ఈ సందర్భంగా ఉత్తర కొరియా మీడియా చెబుతోంది.
ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన సబ్‌మెరైన లాంచ్ బాలిస్టిక్ క్షిపణిని అభివృద్ధి చేయగా.. సరిహద్దుల అవతల ఉన్న లక్ష్యాలనూ ఈ రాకెట్లు నాశనం చేస్తాయని అన్నారు. నీటి అడుగున నుంచి ఎన్నో ఎస్‌ఎల్‌బీఎంలను పరీక్షించినట్లు తెలిపింది. జలాంతర్గామిని అభివృద్ధి చేయాలని ఉత్తరకొరియా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అణ్వాయుధాలతో పాటు బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాల నిర్వహణపై ఉత్తర కొరియాపై అంతర్జాతీయంగా ఆంక్షలు ఉన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ, ఉత్తరకొరియా గతంలో అభివృద్ధి చేసిన పుక్‌గుక్సాంగ్-4 కు అప్‌డేటెడ్ వర్షన్ ను ప్రారంభించింది.