షాకింగ్.. ఆన్‌లైన్ పార్శిల్ తెరిచి చూసి భ‌యంతో కేకలు పెట్టిన మ‌హిళ‌..!

ఆన్‌లైన్‌లో మందులను ఆర్డర్ చేయడం ఒక మహిళ జీవితంలో భయంకరమైన అనుభవంగా మారింది.

By -  Medi Samrat
Published on : 3 Nov 2025 5:01 PM IST

షాకింగ్.. ఆన్‌లైన్ పార్శిల్ తెరిచి చూసి భ‌యంతో కేకలు పెట్టిన మ‌హిళ‌..!

ఆన్‌లైన్‌లో మందులను ఆర్డర్ చేయడం ఒక మహిళ జీవితంలో భయంకరమైన అనుభవంగా మారింది. మందుల‌ ప్యాకెట్‌ను తెరవగానే మహిళ స్పృహ కోల్పోయింది. ఆమెకు భయంతో వణుకు మొదలైంది. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి కేసుకు సంబంధించిన పూర్తి సమాచారం ఇచ్చింది. ఈ కేసు అమెరికాలోని కెంటుకీలోని హాప్‌కిన్స్‌విల్లేలో జరిగింది. మహిళ ఎవరనే విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు.

పోలీసులకు అందిన సమాచారం ప్రకారం. మహిళకు బుధవారం ఒక పార్శిల్ వచ్చింది. అందులో మందులకు బదులుగా మనిషి చేతులు, వేళ్లు ఉన్నాయి. వీటిని ఐస్‌లో ప్యాక్ చేసి ఉంచారు. దీనిపై ఆ మహిళ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ “మాకు మందులు చాలా అవసరం. మాకు 2 పెట్టెలు వచ్చాయి. మేము ఒక పెట్టెను తెరవ‌గా.. అందులో మానవ శరీర భాగాలు ఉన్నాయి.. అవి ఎవరివి.. ఎక్కడికి పంపించారో తెలుసుకోవడానికి మేము ప్రయత్నిస్తున్నామని పేర్కొంది.

మహిళ పోలీసులకు ఫోన్ చేయడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పెట్టెను తీసుకున్నారు. ఈ పెట్టె నాష్‌విల్లే మెడికల్ ట్రైనింగ్ ఫెసిలిటీకి పంపేందుకు పార్శిల్ చేశారు. పొరపాటున మహిళకు డెలివరీ అయ్యిందని దర్యాప్తులో తేలింది. పోలీసులు మానవ అవయవాలను సురక్షితంగా నాష్‌విల్లేకు తరలించారు. పెట్టెలో ఉన్న చేతులు, వేళ్లు నలుగురు వేర్వేరు దాతలకు చెందినవి, వాటిని శస్త్రచికిత్స శిక్షణ కోసం పంపారు.

Next Story