పిల్లలను కారు బయట ఉంచి.. ప్రియుడుతో తల్లి కారులో ఏమి చేస్తోందంటే..

Innocent children of 2 and 5 years standing outside of car. ఓ మహిళ తన బాయ్‌ఫ్రెండ్‌తో ఉన్న సంబంధం కారణంగా తన ఇద్దరు పిల్లలను కారులో

By Medi Samrat
Published on : 21 Dec 2021 8:05 PM IST

పిల్లలను కారు బయట ఉంచి.. ప్రియుడుతో తల్లి కారులో ఏమి చేస్తోందంటే..

ఓ మహిళ తన బాయ్‌ఫ్రెండ్‌తో ఉన్న సంబంధం కారణంగా తన ఇద్దరు పిల్లలను కారులో నుండి బయటకు దింపేసింది. ఆమె స్వయంగా కారులో తన ప్రియుడితో శృంగారాన్ని ప్రారంభించింది. అర్జెంటీనాలోని లా ప్లాటాలో ఉన్న పెరీరా ఇరోలా పార్క్‌లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఎల్ లిటోరల్‌లోని ఒక నివేదిక ప్రకారం.. ఆ మహిళ పిల్లలను కారు బయట వేచి ఉండమని కోరింది. కారు తలుపులు మూసి ప్రియుడితో రొమాన్స్ చేయడం ప్రారంభించింది. ఈ సంఘటన యొక్క వీడియో వైరల్ అయ్యింది. దీనిలో 5 ఏళ్ల చిన్నారి తన రెండేళ్ల సోదరుడితో కలిసి కారులో బయట నిలబడి ఉంది. ఇద్దరు కూడా కారు లోపల చూడటానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలో పిల్లలు ఓ వైపు షాక్ మరో వైపు బాధతో ఉన్నారు. తమ తల్లిని లోపలికి పిలుస్తుందని పిల్లలు తమ కారులోకి చూస్తున్నారని, అయితే వారి తల్లి పట్టించుకోలేదని అక్కడ ఉన్నవారు చెప్పారు.

ఈలోగా పిల్లలు కూడా కారు డోర్ తీయడానికి ప్రయత్నించగా వారు దాన్ని తెరవలేకపోయారు. కారు తలుపు లోపలి నుండి లాక్ చేయబడింది. ఇంతలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వారు మహిళను, ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. ఆ వ్యక్తి ఆ పిల్లలకు తండ్రి కాదని పోలీసులకు తర్వాత తెలిసింది. విచారణలో 28 ఏళ్ల మహిళ తాను ఆ యువకుడిని కొద్ది రోజుల క్రితమే కలిశానని చెప్పింది. వారిద్దరిపై పిల్లల వేధింపులు, లైంగిక వేధింపుల అభియోగాలు నమోదు చేయనున్నారు. ప్రస్తుతం పిల్లలిద్దరినీ కేర్ సెంటర్‌లో ఉంచినట్లు ప్రాసిక్యూటర్ తెలిపారు. దీనిపై పోలీసులు విచారణ చేపడుతున్నారని, త్వరలోనే అభియోగాల జాబితాను విడుదల చేయనున్నారు.


Next Story