బద్ధలైన భారీ అగ్నిపర్వతం
ఇండోనేషియా తూర్పు ప్రాంతంలో సోమవారం ఒక అగ్నిపర్వతం బద్దలైంది.
By Medi SamratPublished on : 19 May 2025 9:21 PM IST

ఇండోనేషియా తూర్పు ప్రాంతంలో సోమవారం ఒక అగ్నిపర్వతం బద్దలైంది. దీంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ఫ్లోర్స్ పర్యాటక ద్వీపంలోని లెవోటోబి లకి-లకి అగ్నిపర్వతం అర్ధరాత్రి దాటిన కొద్దిసేపటికే విస్ఫోటనం చెందింది. ఉదయం 09:36 గంటలకు (0136 GMT) అగ్నిపర్వతం మరోసారి విస్ఫోటనం చెందిందని ఏజెన్సీ తెలిపింది. ఆదివారం జరిగిన వరుస విస్ఫోటనాల కారణంగా లకి-లకి శిఖరం నుండి ఆరు కిలోమీటర్ల వరకు బూడిద వెలువడిందని నిపుణులు తెలిపారు.సమీప గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు.
నవంబర్‌లో మౌంట్ లెవోటోబి లకి-లకి అనేకసార్లు విస్ఫోటనం చెందింది. తొమ్మిది మంది మరణించారు. బాలికి వెళ్లే అంతర్జాతీయ విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. విశాలమైన ద్వీపసమూహ దేశమైన ఇండోనేషియా తరచుగా భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలను ఎదుర్కొంటూ ఉంది.
Next Story