భారతీయ విద్యార్థిపై ఆస్ట్రేలియాలో దాడి

Indian student stabbed multiple times in Australia allegedly for cash. 28 ఏళ్ల భారతీయ విద్యార్థిపై ఆస్ట్రేలియాలో దాడి జరిగింది.

By Medi Samrat  Published on  14 Oct 2022 8:00 PM IST
భారతీయ విద్యార్థిపై ఆస్ట్రేలియాలో దాడి

28 ఏళ్ల భారతీయ విద్యార్థిపై ఆస్ట్రేలియాలో దాడి జరిగింది. డబ్బులు లాక్కోడానికి ప్రయత్నిస్తూ దుండగులు భారతీయ విద్యార్థి ముఖం, ఛాతీ, పొత్తికడుపుపై ​​పలుసార్లు కత్తితో పొడిచినట్లు అధికారులు తెలిపారు. అక్టోబరు 6వ తేదీ రాత్రి 10.30 గంటలకు శుభమ్ గార్గ్ పసిఫిక్ హైవే వెంబడి నడుచుకుంటూ వెళుతుండగా ఈ ఘటన జరిగిందని ఎన్‌ఎస్‌డబ్ల్యూ పోలీస్ ఫోర్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు డేనియల్ నార్వుడ్‌ను అరెస్టు చేశారు. నిందితుడిపై హత్యాయత్నం అభియోగాలు మోపారు.

శుభమ్ గార్గ్ ముఖం, ఛాతీ, పొత్తికడుపుపై ​​అనేక కత్తిపోట్లకు గురయ్యాడని.. అతన్ని రాయల్ నార్త్ షోర్ ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు అధికారులు తెలిపారు. అతడికి శస్త్రచికిత్స కూడా నిర్వహించారని.. అతడి ఆరోగ్యం కుదుటపడుతోందని NSW పోలీస్ ఫోర్స్ ప్రకటన తెలిపింది. గురువారం పసిఫిక్ హైవే లేన్ కోవ్ దగ్గర ఒక గుర్తు తెలియని వ్యక్తి గార్గ్‌ దగ్గరకు వచ్చాడు.. డబ్బులను లాక్కోడానికి ప్రయత్నించాడని ఇన్ ది కోవ్ వార్తాపత్రిక నివేదించింది. దుండగుడు పారిపోయే ముందు గార్గ్ పొత్తికడుపులో చాలాసార్లు కత్తితో పొడిచినట్లు నివేదిక పేర్కొంది.


Next Story