థేమ్స్ నదిలో శవమై తేలిన భారతీయ విద్యార్థి

గత నెలలో బ్రిటన్‌లో అదృశ్యమైన 23 ఏళ్ల భారతీయ విద్యార్థి థేమ్స్ నదిలో శవమై కనిపించాడు.

By Medi Samrat  Published on  1 Dec 2023 9:30 PM IST
థేమ్స్ నదిలో శవమై తేలిన భారతీయ విద్యార్థి

గత నెలలో బ్రిటన్‌లో అదృశ్యమైన 23 ఏళ్ల భారతీయ విద్యార్థి థేమ్స్ నదిలో శవమై కనిపించాడు. మిత్‌కుమార్ పటేల్ సెప్టెంబరులో ఉన్నత చదువుల కోసం యూకేకు చేరుకున్నాడు, అతడు నవంబర్ 17న కనిపించకుండా పోయాడు. మెట్రోపాలిటన్ పోలీసులు నవంబర్ 21న తూర్పు లండన్‌లోని కానరీ వార్ఫ్ ప్రాంతానికి సమీపంలోని థేమ్స్ నదిలో అతని మృతదేహాన్ని కనుగొన్నారు.

అయితే అతడి మృతదేహాన్ని భారత్ కు పంపించేందుకు ఆన్‌లైన్ నిధుల సమీకరణను ప్రారంభించారు. మిత్‌కుమార్ పటేల్ రైతు కుటుంబానికి చెందినవాడు. అతను నవంబర్ 17, 2023 నుండి తప్పిపోయాడని ఫండ్ రైజింగ్ చేస్తున్న వారు తెలిపారు. అతని కుటుంబానికి సహాయం చేయడానికి నిధుల సేకరణ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ‘ఈవినింగ్ స్టాండర్డ్’ వార్తాపత్రిక ప్రకారం మృతి చెందిన విద్యార్థి షెఫీల్డ్ హాలమ్ విశ్వవిద్యాలయంలో డిగ్రీ చేస్తున్నాడు. అమెజాన్‌లో పార్ట్‌టైమ్ ఉద్యోగం ప్రారంభించడానికి నవంబర్ 20న షెఫీల్డ్‌కు వెళ్లాల్సి ఉంది.

Next Story