అక్కడ చదవడానికి ఎక్కువగా వెళ్లింది మనోళ్లే.. రెండో స్థానం ఎవరిదంటే..
అమెరికా విశ్వవిద్యాలయాలను ఎంచుకునే భారతీయ విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఇ
By Medi Samrat Published on 19 Nov 2024 9:26 AM ISTఅమెరికా విశ్వవిద్యాలయాలను ఎంచుకునే భారతీయ విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సోమవారం ప్రచురించిన ఓపెన్ డోర్స్ నివేదిక ప్రకారం.. భారతదేశంలోని 3.3 లక్షల మందికి పైగా విద్యార్థులు అమెరికాలో చదువుతున్నారు. దీంతో గత 15 ఏళ్లలో తొలిసారిగా 2022-23 విద్యాసంవత్సరంలో అత్యధిక విదేశీ విద్యార్థులను అమెరికాకు పంపిన దేశంగా భారత్ అగ్రస్థానంలో నిలిచింది. గత విద్యా సంవత్సరం కంటే దేశంలో 23 శాతం పెరుగుదల కనిపించింది. అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థుల్లో భారతీయ విద్యార్థుల వాటా 29 శాతానికి చేరుకుందని అమెరికా రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. యుఎస్‌లో ఉన్న అంతర్జాతీయ విద్యార్థులలో భారత్ ఇప్పుడు అగ్రగామి దేశం.
అమెరికాలో చదువుతున్న భారత విద్యార్థులు 3,31,602 మంది కాగా.. తర్వాత చైనా(2,77,398) రెండో స్థానంలో ఉంది. దక్షిణ కొరియా మూడవ స్థానంలో (43,149), కెనడా నాల్గవ స్థానంలో (28,998), తైవాన్((23,157)) ఐదవ స్థానంలో ఉన్నాయి ది ఓపెన్ డోర్స్ నివేదికను ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ప్రచురించింది. యునైటెడ్ స్టేట్స్‌లోని విదేశీ విద్యార్థుల సంఖ్య గురించి IIE ఏటా ఒక అధ్యయనాన్ని విడుదల చేస్తుంది.
2023-24
విద్యా సంవత్సరంలో USలో భారతీయ విద్యార్థుల సంఖ్య: 3,31,602
పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు PhD స్థాయిలో విద్యార్థుల సంఖ్య: 1,96,567
గ్రాడ్యుయేట్ విద్యార్థుల సంఖ్య: 36,053
2022-23
విద్యా సంవత్సరంలో అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థులు: 2,68,923
ఈ మేరకు భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో.. 2008-2009 తర్వాత తొలిసారిగా అమెరికాకు విద్యార్థులను పంపడంలో భారత్ అగ్రస్థానంలో ఉందని పేర్కొంది. అమెరికాలో చదువుతున్న భారతీయ పిల్లల సంఖ్య ఇదే అత్యధికం. అమెరికాలో అకడమిక్ సెషన్ సాధారణంగా సెప్టెంబర్ నుండి మొదలై మే వరకు కొనసాగుతుంది.