సీజ్ ఫైర్‌కు ఒప్పుకున్నాయ్.. ట్రంప్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

భారత్-పాకిస్థాన్ మధ్య ఉత్కంఠకు తెరపడినట్లేనని తెలుస్తోంది.

By Medi Samrat
Published on : 10 May 2025 5:57 PM IST

సీజ్ ఫైర్‌కు ఒప్పుకున్నాయ్.. ట్రంప్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

భారత్-పాకిస్థాన్ మధ్య ఉత్కంఠకు తెరపడినట్లేనని తెలుస్తోంది. అమెరికా మధ్యవర్తిత్వం తర్వాత భారతదేశం, పాకిస్తాన్ పూర్తి, తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం అన్నారు. ఇరు దేశాలు కామన్ సెన్స్ తో ఆలోచించాయని, వారి ఇంటెలిజెన్స్ కు కూడా ధన్యవాదాలని ట్రంప్ ట్వీట్ చేశారు.

ఇదిలావుంటే.. రెండు రోజులుగా పాకిస్థాన్ దాడులకు చేస్తోన్న ప్రయత్నాలను తిప్పికొడుతోన్న భారత సైన్యం.. దాయాది సైనిక స్తావరాలు, ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేస్తోంది. ఇరు దేశాల మధ్య ఘర్షణ తీవ్రస్థాయికి చేరిన నేపథ్యంలో మరోసారి త్రివిధ దళాధిపతులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సైతం పాల్గొన్నారు.

ఆపరేషన్ సిందూర్‌తో రగిలిపోతున్న పాకిస్థాన్.. వరుసగా రెండు రోజుల నుంచి డ్రోన్లు, క్షిపణులు, యుద్ధ విమానాలతో దాడులు చేస్తోంది. ఈ దాడులను గట్టిగానే తిప్పికొట్టిన భారత సైన్యం.. ప్రతీకార చర్యలు చేపట్టింది. అధికారిక వర్గాల ప్రకారం.. పాకిస్థాన్ సైనిక స్థావరాలు, ఓ ఉగ్రవాద లాంచ్‌ప్యాడ్‌ను భారత దళాలు నాశనం చేశాయి.

Next Story