పాకిస్థాన్ ప్రధాని ఖాన్ కు చిక్కులు తప్పడం లేదు. అల్ ఖాదిర్ కేసులో ఇమ్రాన్ ఖాన్, ఆయన సతీమణి బుష్రా బీబీలను కోర్టు దోషులుగా తేల్చింది. ఈ కేసులో ఇమ్రాన్ ఖాన్ కు 14 ఏళ్ల జైలు శిక్ష, బుష్రాకు ఏడేళ్ల జైలు శిక్షను కోర్టు విధించింది. ఇమ్రాన్ కు 10 లక్షలు, బుష్రాకు 5 లక్షల పాకిస్థానీ రూపాయల జరిమానా విధించింది.
లండన్ లో ఉంటున్న పాకిస్థాన్ స్థిరాస్తి వ్యాపారి మాలిక్ రియాజ్ హుసేన్ నుంచి 19 కోట్ల పౌండ్లను బ్రిటన్ ప్రభుత్వం పాకిస్థాన్ కు పంపగా, ఆ సొమ్మును ఇమ్రాన్ దంపతులు సొంతంగా వాడుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇమ్రాన్ పై ఇప్పటి వరకు 200కు పైగా కేసులు ఉన్నాయి. 2023 ఆగస్ట్ నుంచి ఆయన జైలు జీవితం గడుపుతున్నారు. వివిధ కారణాల వల్ల మూడుసార్లు వాయిదా పడిన తీర్పును చివరిసారిగా జనవరి 13న అవినీతి నిరోధక న్యాయస్థానం న్యాయమూర్తి నాసిర్ జావేద్ రాణా ప్రకటించారు.