అమెరికాలో హైదరాబాదీ అబ్దుల్ మహ్మద్ ఏమైపోయాడు.. ఊహించని కాల్

గత 12 రోజులుగా అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి అబ్దుల్ మహ్మద్ కుటుంబానికి మంగళవారం కిడ్నాపర్ల నుండి కాల్ వచ్చింది.

By Medi Samrat  Published on  20 March 2024 8:00 PM IST
అమెరికాలో హైదరాబాదీ అబ్దుల్ మహ్మద్ ఏమైపోయాడు.. ఊహించని కాల్

గత 12 రోజులుగా అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి అబ్దుల్ మహ్మద్ కుటుంబానికి మంగళవారం కిడ్నాపర్ల నుండి కాల్ వచ్చింది. డ్రగ్ ట్రాఫికింగ్‌లో పాల్గొన్న ముఠా అబ్దుల్‌ను కిడ్నాప్ చేసిందని భావిస్తూ ఉన్నారు. అబ్దుల్ తండ్రి మహ్మద్ సలీమ్ నుండి డబ్బు డిమాండ్ చేశారు. 25 ఏళ్ల అబ్దుల్, మే 2023లో స్టూడెంట్ వీసాపై USలోని క్లీవ్‌ల్యాండ్‌కి వెళ్లాడు. మార్చి 7 నుండి కుటుంబ సభ్యులతో టచ్ లో లేకుండా పోయాడు. అనంతరం అమెరికాలో ఉన్న అతని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో లుకౌట్ నోటీసు జారీ చేశారు. మంగళవారం, నాచారంలో నివసించే అబ్దుల్ తండ్రికి 1200 అమెరికన్ డాలర్లు చెల్లించాలని కాల్ వచ్చింది. అయితే సదరు కాలర్ ఎలా డబ్బులు పంపాలో చెప్పలేదు.

ఈ బెదిరింపు ఫోన్ కాల్‌ గురించి US పోలీసులకు తెలియజేయడానికి సలీమ్ కాలర్ వివరాలను వాషింగ్టన్‌లోని తన బంధువుకు ఫార్వార్డ్ చేశాడు పోలీసులు లుకౌట్ నోటీసులో, అబ్దుల్‌ను 5'8" పొడవు, 150 పౌండ్ల బరువు ఉన్నాడని తెలిపారు. ఎవరి దగ్గరైనా సమాచారం ఉంటే తమను సంప్రదించాలని పోలీసులు కోరారు. మార్చి 18న కుటుంబ సభ్యులు చికాగోలోని భారత కాన్సులేట్‌ను కూడా సంప్రదించారు.

Next Story