150 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన పక్షి.. మళ్లీ ఇప్పుడు కనిపించడంతో షాక్‌.!

Giant owl not seen for 150 years found in the wild. అది ఓ పెద్ద గుడ్లగూబ. 150 ఏళ్ల కిందట కనిపించకుండా పోయింది. అందరూ ఆ గుడ్లగూబ జాతి అంతరించిపోయిందనుకున్నారు.

By అంజి  Published on  27 Oct 2021 10:34 AM GMT
150 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన పక్షి.. మళ్లీ ఇప్పుడు కనిపించడంతో షాక్‌.!

అది ఓ పెద్ద గుడ్లగూబ. 150 ఏళ్ల కిందట కనిపించకుండా పోయింది. అందరూ ఆ గుడ్లగూబ జాతి అంతరించిపోయిందనుకున్నారు. కానీ అది సడన్‌గా ఇప్పుడు మళ్లీ కనబడింది. ఆ గుడ్లగూబ అందరినీ ఆశ్చర్యానికి, షాక్‌కు గురి చేస్తోంది. తాజాగా కనబడిన గుడ్లగూబ ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అక్టోబర్‌ 16వ తేదీన ఈ పక్షిని ఘనాలోని అటెవా ఫారెస్ట్‌లో గుర్తించారు. లండన్‌లోని ఇంపీరియల్‌ కాలేజీకి చెందిన లైఫ్‌ సైన్సెస్‌ ప్రొఫెసర్‌ జోసెఫ్‌ తొబియాస్‌, పర్యావరణ శాస్త్రవేత్త రాబర్ట్ విలియమ్స్‌లు ఈ పక్షిని గుర్తించి వెంటనే దాన్ని ఫొటో తీశారు. బైనాక్యులర్‌లో ఆ గుడ్లగూబను చూసి షాక్‌ అయ్యామని డాక్టర్‌ జోసెఫ్ తెలిపారు. అది చాలా పెద్ద గుడ్లగూబ, ఆఫ్రికాలోని ఏ ఫారెస్ట్‌లో కూడా ఇంత పెద్ద గుడ్లగూబను చూడలేదన్నారు. ఫొటో తీసి జూమ్‌ చేసి చూస్తే 150 ఏళ్ల కిందట కనిపించకుండా పోయిన షెల్లీ జాతికి చెందిన గుడ్లగూబగా గుర్తించామని జోసెఫ్ తెలిపారు.

షెల్లీ జాతికి చెందిన గుడ్లగూబ

ఇవి 53 నుంచి 61 సెంటీ మీటర్ల పొడవు ఉంటాయి.

ఇవి చివరిసారిగా ఆఫ్రికా అడవుల్లో 1870లో కనిపించాయి.

ఇవి ఎక్కువగా వెస్టర్న్‌ ఆఫ్రికాలో ఉండేవి

ఇవి ప్రపంచంలోనే అతి పెద్ద గుడ్లగూబలు

నేచర్‌ను మత చేజేతులతో నాశనం చేస్తున్నాం.. అడవుల నరికివేత, కాలుష్యంతో ఎన్నో జీవ జాతులు నశించిపోతున్నాయి. ఇప్పటికైనా మనుషులు కళ్లు తెరిచి చూడాలి. లేదంటే ఈ భూమి తీవ్ర కాలుష్యంతో వినాశనానికి గురికాక తప్పదు.!

Next Story