ఇండోనేషియాలోని ఆ గ్రామ‌పు వీధుల్లోకి రక్తపు రంగు వ‌ర‌ద నీరు!

Flooding turns Indonesian village waters red with factory dye. అదేంటీ అక్కడ ఏమైనా యుద్దాలు అవుతున్నాయా.. పూర్వ కాలంలో

By Medi Samrat  Published on  7 Feb 2021 2:55 PM GMT
ఇండోనేషియాలోని ఆ గ్రామ‌పు వీధుల్లోకి రక్తపు రంగు వ‌ర‌ద నీరు!

అదేంటీ అక్కడ ఏమైనా యుద్దాలు అవుతున్నాయా.. పూర్వ కాలంలో భారీ సైన్యాల మద్య యుద్దాలు జరిగితే రక్తం ఏరులై పారేది అనేవారు. తాజాగా అక్కడి వీధుల్లో నీటి వరద ప్రవహిస్తుంది. మరి ఆ వరద నీరు కాకుండా రక్తం రంగులో ఉండటం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇది యుగాంతానికి సూచనే అంటూ సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు హోరెత్తుతాయి. సాధారణంగా ఎక్కడైనా భారీ వర్షాలు కురిసినపుడు వరదలు వచ్చినప్పుడు ఆ నీరు బురదగా, గోధుమ రంగులో ఉంటుంది .

కానీ నిన్న ఇండోనేషియాలోని జంగోగోట్ గ్రామాన్ని ముంచెత్తిన వరద నీరు మాత్రం పూర్తిగా ఎరుపు రంగులో అచ్చం రక్తంలా ఉందని చెబుతున్నారు. తమ సెల్‌ ఫోన్లతో వీడియోలు తీసి నెట్టింట్లో పోస్ట్‌లు చేశారు. అయితే ఈ విషయమై స్పందించిన అధికారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. వరద నీరు ఎరుపు రంగులో ఉండటానికి కారణాలను అధికారులు వెల్లడించారు.

ఈ వర్షం నీరు చూసి భయపడాల్సిన అవసరం లేదని.. వర్షం కురిపించిన ప్రాంతానికి సమీపంలోని బాతిక్ కర్మాగారంలోని రంగులు వరద నీటిలో కలిసి పోయాయి. ఫలితంగా రక్తాన్ని పోలిన ముదురు ఎరుపు రంగు వరద నీటిలో కలిసిపోయి గ్రామాన్ని చుట్టుముట్టింది. అధికారులు ఈ విషయాన్ని తెలియజేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.


Next Story