ప్రపంచాన్ని 150 సార్లు నాశనం చేయవచ్చు.. ట్రంప్ సంచలన వ్యాఖ్య‌లు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు.

By -  Medi Samrat
Published on : 3 Nov 2025 4:15 PM IST

ప్రపంచాన్ని 150 సార్లు నాశనం చేయవచ్చు.. ట్రంప్ సంచలన వ్యాఖ్య‌లు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ప్రపంచాన్ని 150 సార్లు నాశనం చేయవచ్చని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. రష్యా, చైనా, ఉత్తర కొరియా, పాకిస్థాన్‌లు నిరంతరం పరీక్షలు చేస్తున్నాయని, అమెరికా మాత్రం వెనుకబడి ఉందని ట్రంప్‌ అన్నారు.

CBS న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్.. ప్రపంచంలో చాలా అణు బాంబులు ఉన్నాయని, ప్రపంచాన్ని 150 సార్లు నాశనం చేయవచ్చని బహిరంగంగా చెప్పారు. ట్రంప్ మాట్లాడుతూ.. ఈ దేశాలు ఎవరూ చూడని చోట భూగర్భంలో పరీక్షిస్తున్నాయన్నారు. స్వల్ప కంపనం మాత్రమే అనుభూతి చెందుతుంది. కానీ అమెరికా అనేది బహిరంగ సమాజం కాబట్టి మనం చెప్పాలి. ఇతరులు పరీక్షలు చేస్తుంటే అమెరికా కూడా ఆ పని చేయాలని ట్రంప్ నొక్కి చెప్పారు.

1992 నుంచి అమెరికా పూర్తి స్థాయిలో అణ్వాయుధాల పరీక్ష నిర్వహించలేదని.. ఇప్పుడు మళ్లీ దాన్ని ప్రారంభించాలని ట్రంప్‌ సమర్థిస్తున్నారు. నార్త్ కొరియా లాంటి చిన్న దేశం నిరంతరం పరీక్షలు చేయగలిగితే అమెరికా లాంటి అగ్రరాజ్యం వెనుకంజ వేయకూడదని అంటున్నారు. "వారు పరీక్షిస్తున్నారు కాబట్టి మేము పరీక్షిస్తాము" అని ట్రంప్ స్పష్టంగా చెప్పారు.

రష్యా పరీక్షిస్తోంది, చైనా పరీక్షిస్తోంది, కానీ దాని గురించి మాట్లాడరు, ఉత్తర కొరియా నిరంతరం పరీక్షలు నిర్వహిస్తోంది, పాకిస్తాన్ కూడా పరీక్షిస్తోంది అని ట్రంప్ అన్నారు. అమెరికా పరీక్షలు చేయకుంటే.. ఆ పని చేయని ఏకైక దేశం అవుతుందని హెచ్చరించారు. ఆయుధాల విశ్వసనీయతను తనిఖీ చేసేందుకు పరీక్షలు అవసరమని ట్రంప్ అభిప్రాయపడ్డారు.

Next Story