చైనాలో 4.5 తీవ్ర‌త‌తో భూకంపం

అక్టోబర్ 1 ఆదివారం నాడు చైనాలోని కింగ్‌హైలో భూకంపం సంభవించింది.

By Medi Samrat  Published on  1 Oct 2023 8:11 PM IST
చైనాలో 4.5 తీవ్ర‌త‌తో భూకంపం

అక్టోబర్ 1 ఆదివారం నాడు చైనాలోని కింగ్‌హైలో భూకంపం సంభవించింది. కింగ్‌హైలో భూకంపం రిక్టర్ స్కేలుపై 4.5గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మాలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది. ఎన్‌సీఎస్ ప్రకారం.. భూకంపం సాయంత్రం 5:04 గంటలకు 86 కి.మీ లోతులో సంభవించింది. నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మాలజీ ఈ సమాచారాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'X'లో పంచుకుంది.

అంత‌కుముందు ఆగస్టు 6, 2023న తూర్పు చైనాలోని షాన్‌డాంగ్ ప్రావిన్స్‌లో 5.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. చైనా భూకంప నెట్‌వర్క్ సెంటర్ (CENC)ని ఉటంకిస్తూ.. ఆగస్టు 6న స్థానిక కాలమానం ప్రకారం.. తెల్లవారుజామున 2:33 గంటలకు పింగ్యువాన్ కౌంటీ, డెజౌ సిటీ, షాన్‌డాంగ్ ప్రావిన్స్‌లో 5.5 తీవ్రతతో భూకంపం సంభవించిందని CGTN నివేదించింది.

Next Story