ఇజ్రాయెల్, యుఎస్‌తో కొనసాగుతున్న యుద్ధం మధ్య మంగళవారం దక్షిణ ఇరాన్‌లోని గెరాష్ నగరంలో 4.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యుఎస్‌జిఎస్) తెలిపింది. భూమికి 10 కిలోమీటర్ల దిగువన భూకంపం సంభవించిందని, ప్రకంపనలు ప్రజలను భయాందోళనలకు గురిచేశాయని యుఎస్‌జిఎస్ తెలిపింది. అయితే.. ఆ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తత దృష్ట్యా కొంతమంది ఇరాన్ అణు పరీక్ష నిర్వహించిందా? అనే అనుమానాలు తలెత్తాయి.. అయితే, అటువంటి వాదనలకు మద్దతు ఇచ్చే అధికారిక ధృవీకరణ లేదు.
ఈ భూకంపం మార్చి 3, 2026న స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:24 గంటలకు (UTC+05:30) ఇరాన్‌లోని గెరాష్‌కు వాయవ్య దిశగా 52 కి.మీ దూరంలో సంభవించింది. దీని కేంద్ర అక్షాంశం 28.036°N కాగా.. రేఖాంశం 53.789°E. భూకంపం భూమి ఉపరితలం నుండి 10 కి.మీ. కిందకి వచ్చింది. ఇరాన్ యాక్టివ్ ఫాల్ట్ జోన్లలో ఇలాంటి పెద్ద ప్రకంపనలు సర్వసాధారణమని, సహజ భూకంపాల వల్ల వచ్చే భూకంప నమూనాలు భూగర్భంలో అణు విస్ఫోటనాల వల్ల ఏర్పడే నమూనాలకు చాలా భిన్నంగా ఉంటాయని భూకంప శాస్త్రవేత్తలు చెబుతున్నారు.