చైనాలో భారీ భూకంపం

Earthquake In China. చైనాలో భారీ భూకంపం వచ్చింది. 7.3 మ్యాగ్నిట్యూడ్ తో చైనాను భూకంపం వణికించింది.

By Medi Samrat  Published on  22 May 2021 4:17 AM GMT
చైనాలో భారీ భూకంపం

చైనాలో భారీ భూకంపం వచ్చింది. 7.3 మ్యాగ్నిట్యూడ్ తో చైనాను భూకంపం వణికించింది. దక్షిణ కింగ్హై లో శనివారం తెల్లవారు జామున ఈ భూకంపం సంభవించింది. కింగ్హై నగరానికి నైరుతి దిశలో 400 కిలోమీటర్ల దూరంలో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 7.4గా నమోదైంది. కింగ్హై కేంద్రంగా తెల్లవారుజామున 2.04 గంటలకు సంభవించిన భూకంపం 10 కిలోమీటర్ల లోతులో వచ్చింది. ఈ భూకంపం కారణంగా ఇద్దరు వ్యక్తులు మరణించారని అక్కడి మీడియా చెబుతోంది. జిన్ జింగ్‌పై కూడా భూకంప ప్రభావం ఉందని అమెరికా సిస్మొలాజిస్టులు తెలియజేశారు.

శుక్రవారం రాత్రి యున్నాన్‌లో కూడా భూమి కంపించింది. 6.1 తీవ్రతతో భూమి కంపించింది. దీంతో ఒకరు చనిపోయారని స్థానిక అధికారులు రిపోర్ట్ చేశారు. మరో ముగ్గురు శిథిలాల్లో చిక్కుకున్నారని తెలిపారు. భూ ప్రకంపనాలు రాగానే జనం ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు. కొన్ని భవనాలు కూలిపోయామని.. మరికొన్ని దెబ్బతిన్నాయని అధికారులు వివరించారు. ఈ ఘటనల గురించి చైనా నుండి సమాచారం రావాల్సి ఉంది.


Next Story