విజిటింగ్ వీసాతో వెళ్లి అడుక్కుంటూ ఉన్నారు.. అడ్డంగా దొరికిపోయారు

పవిత్ర రంజాన్ మాసం మొదటి అర్ధభాగంలో 112 మంది పురుషులు, 90 మంది ఆడవారు సహా 202 మంది యాచకులను దుబాయ్ పోలీసులు అరెస్టు చేశారు.

By Medi Samrat  Published on  27 March 2024 9:00 PM IST
విజిటింగ్ వీసాతో వెళ్లి అడుక్కుంటూ ఉన్నారు.. అడ్డంగా దొరికిపోయారు

పవిత్ర రంజాన్ మాసం మొదటి అర్ధభాగంలో 112 మంది పురుషులు, 90 మంది ఆడవారు సహా 202 మంది యాచకులను దుబాయ్ పోలీసులు అరెస్టు చేశారు. గత కొన్నిరోజులుగా దుబాయ్ పోలీసులు భిక్షాటన చేస్తున్న వారిని అదుపులోకి తీసుకుంటూ ఉన్నారు. భిక్షాటనను నిరోధించడం ద్వారా నాగరిక సమాజాన్ని పరిరక్షించడం గురించి అవగాహన పెంచడం ఈ ప్రచారం లక్ష్యం.

చాలా మంది అరెస్టయిన వ్యక్తులు విజిట్ వీసా తీసుకుని వెళ్లినట్లు తెలుస్తోంది. రంజాన్ సమయంలో డబ్బు సులువుగా సంపాదించవచ్చని వీరంతా దుబాయ్ కు వెళుతున్నారు. భిక్షాటనను ఎలాంటి పరిస్థితుల్లో ఉపేక్షించమని దుబాయ్ పోలీస్‌లోని సస్పెక్ట్స్ అండ్ క్రిమినల్ ఫినామినా డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ బ్రిగ్ అలీ సలేమ్ అల్ షమ్సీ హెచ్చరించారు. దొంగతనం, దోపిడీ వంటి నేరాలు, చట్టవిరుద్ధమైన పనులు చేయడం మాత్రమే కాదు.. యాచించడం కూడా తీవ్రంగా పరిగణిస్తామని అల్ షమ్సీ హైలైట్ చేశారు. ఇ-క్రైమ్ ప్లాట్‌ఫారమ్‌తో పాటు కాల్ సెంటర్ 901, పోలీసు యాప్‌లోని ‘పోలీస్ ఐ’ లో ఎవరైనా బిచ్చగాళ్లు కనిపిస్తే రిపోర్ట్ చేయాలని ఆయన ప్రజలను కోరారు.

Next Story