100 మంది అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితా.. భారత్‌ నుండి ముగ్గురు.!

Dolly Parton on 2021 TIME 100 Most Influential People list. ప్రముఖ మ్యాగజైన్‌ 'టైమ్‌' 2021 సంవత్సరానికి ప్రపంచంలోని 100 మంది అత్యంత

By అంజి  Published on  16 Sep 2021 4:06 AM GMT
100 మంది అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితా.. భారత్‌ నుండి ముగ్గురు.!

ప్రముఖ మ్యాగజైన్‌ 'టైమ్‌' 2021 సంవత్సరానికి ప్రపంచంలోని 100 మంది అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్‌ నుంచి ముగ్గురికి చోటు లభించింది. 'టైమ్‌' మ్యాగజైన్ జాబితాలో ప్రధాని నరేంద్ర మోడీ, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ సీఈవో అదర్‌ పునావాలా ఉన్నారు. అలాగే ఈ జాబితాలో అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, అప్ఘనిస్తాన్ ఉపప్రధాని, తాలిబన్ సహా వ్యవస్థాపకుడు ముల్లా బరదార్ ఉన్నారు.

ఇక 'టైమ్' మ్యాగజైన్‌లో ప్రధాని మోడీ ప్రొఫైల్‌ను ప్రముఖ జర్నలిస్టు ఫరిద్ జకారియా రాశారు. " 74 ఏళ్ల స్వతంత్రం భారతవనిలో ముగ్గురు కీలక నాయకులు ఉన్నారు. మొదటి వ్యక్తి జవహర్ లాల్ నెహ్రూ దేశంలో లౌకిక, ప్రజాస్వామ్యం ఏర్పాటు చేశారు. రెండవ వ్యక్తి ఇందిరాగాంధీ దేశంలోని ఎమర్జెన్సీని విధించారు. ఇక మూడవ వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ వారి తర్వాత ఎవరూ లేని విధంగా దేశ రాజకీయాలను శాసిస్తున్నారు. దేశంలో మైనార్టీల హక్కులు హరించడంతోపాటు ప్రశ్నిస్తున్న జర్నలిస్టులను జైళ్లో పెడుతున్నారు. భారతదేశంను లౌకికవాదం నుండి హిందు జాతీయవాదం వైపు నెడుతున్నారు" అంటూ జర్నలిస్టు ఫరిద్ జకారియా రాసుకొచ్చారు.

టైమ్‌ మ్యాగజైన్‌ అత్యంత ప్రభావశీల జాబితాలో స్పెస్ ఎక్స్ సంస్థ అధిపతి ఎలన్‌మస్క్‌, టెన్నిస్ ప్లేయర్ నవోమి ఒసాకా, ఆపిల్ సీఈవో టిమ్‌ కుక్, ప్రిన్స్ హ్యారీ -మెఘన్ మెర్కెల్ దంపతులు, రష్యా ఉద్యమకారుడు అలెక్సీ నావల్నీ, ప్రముఖ సింగర్ బ్రిట్నీ స్పియర్స్, హాలీవుడ్ యాక్టర్ కేట్ విన్‌స్లెట్‌తో పాటు తదతరులు ఉన్నారు.


Next Story