పిల్లలను పాకిస్థాన్ కు తీసుకుని వెళ్లిపోవడమే ప్లాన్

తన ఫేస్‌బుక్ స్నేహితుడు నస్రుల్లా కోసం పాకిస్థాన్ వెళ్లిన భారతీయ మహిళ అంజు అలియాస్ ఫాతిమా వాఘా బోర్డర్ ద్వారా భారతదేశానికి తిరిగి వచ్చారు.

By Medi Samrat  Published on  30 Nov 2023 9:15 PM IST
పిల్లలను పాకిస్థాన్ కు తీసుకుని వెళ్లిపోవడమే ప్లాన్

తన ఫేస్‌బుక్ స్నేహితుడు నస్రుల్లా కోసం పాకిస్థాన్ వెళ్లిన భారతీయ మహిళ అంజు అలియాస్ ఫాతిమా వాఘా బోర్డర్ ద్వారా భారతదేశానికి తిరిగి వచ్చారు. అమృత్‌సర్‌లోని పంజాబ్ పోలీసు ఇంటెలిజెన్స్, ఐబి అధికారులు ఆమెను విచారించిన తర్వాత న్యూఢిల్లీకి వెళ్లేందుకు అనుమతించారు. పాక్ డిఫెన్స్ ఏజెన్సీలు లేదా సిబ్బందితో ఏదైనా సంప్రదింపుల గురించి ఆమెను అడిగారు. అలాంటిదేమీ లేదని ఆమె తెలిపింది. అంజు భారత్‌లో ఉండాలని అనుకోవడం లేదని తెలుస్తోంది. తాను తిరిగి పాకిస్తాన్‌కు వెళ్తానని.. తన భారతీయ భర్త అరవింద్‌తో విడాకులు తీసుకున్న తర్వాత తన పిల్లలను కూడా పాకిస్థాన్‌కు తీసుకెళ్తానని చెప్పింది.

ఉత్తరప్రదేశ్‌లోని కైలోర్ గ్రామంలో జన్మించిన అంజు రాజస్థాన్‌లోని అల్వార్‌లో ఉండేది. ఈ ఏడాది జూలై నెలలో ఫేస్‌బుక్ ఫ్రెండ్‌ని కలుసుకునేందుకు పాకిస్తాన్ వెళ్ళిపోయింది. తన స్నేహితుడు నస్రుల్లాను పెళ్లి చేసుకుని పాకిస్తాన్ లోని ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో నివాసం ఉన్నట్లు తేలింది. పాక్ ప్రభుత్వం కూడా ఆమె వీసాను మరో ఏడాది పొడిగించింది. అంజూ, తన ఇద్దరు పిల్లల్ని విడిచిపెట్టి వచ్చినందుకు మానసికంగా కుమిలిపోతోందని నస్రుల్లా పాక్ మీడియాతో చెప్పినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆమె తిరిగి భారత్ కు వచ్చినట్లు తెలుస్తోంది. అంజు వాఘా సరిహద్దు నుండి భారతదేశం లోకి రాగానే ఆమెను సరిహద్దు భద్రతా దళ శిబిరానికి తీసుకువెళ్లారు.. అక్కడే ఆమెను విచారించారు.

Next Story