సిరియాలో బాంబు దాడి జరిగింది. రాజధాని డమస్కస్‌లో ఓ మిలిటరీ బస్సులో బాంబు పేలింది. ఈ పేలుడు ధాటికి 14 మృతి చెందారు. జిసర్ అల్ రాయిస్ బ్రిడ్జ్‌ను బస్సు దాటుతుండగా.. రెండు బాంబులతో బస్సును పేల్చేశారని ఆ దేశ మీడియా పేర్కొంది. ''నేను బలమైన పేలుడు శబ్దం విని నిద్రపోతున్నాను, నిద్ర లేచి చూసేసరికి బస్సు కాలిపోయింది'' అని బ్రిడ్జి సమీపంలోని మార్కెట్‌లో ఫ్రూట్ సెల్లర్ అబూ అహ్మద్ మీడియాకు తెలిపారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ పేలుడు ఘటనను పిరికిచర్యగా డమస్కస్ పోలీసు కమాండర్ మేజర్ జనరల్ హుస్సేన్ జుమా అన్నారు.
బాంబు దాడికి పాల్పడింది తామే అని ఇంకా ఏ గ్రూప్ చెప్పలేదు. ఇడ్లిబ్ ప్రావిన్స్‌లోని అరిహ పట్టణంలో మరో దాడి జరిగింది. ఈ దాడిలో మరణించిన 10 మందిలో నలుగురు పిల్లలు, ఒక మహిళ ఉన్నారు. గత కొంత కాలంగా రాజధాని డమస్కస్‌లో దాడి ఘటనలు పెరుగుతునట్లు తెలిసింది. సిరియాలో ఎప్పటి నుంచో ప్రచ్ఛన్న యుద్ధం సాగుతూనే ఉంది. అసద్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు 2011 సంవత్సరం నుండి సిరియాలో ఉద్యమం నడుస్తోంది. ఈ ఉద్యమంలో ఇప్పటి వరకు 3.50 లక్షల మంది మరణించగా.. సగం మంది జనాభా తమ సొంత ఇండ్లను విడిచి పెట్టి వెళ్లిపోయారు.